వడదడ! | - | Sakshi
Sakshi News home page

వడదడ!

May 26 2026 8:06 AM | Updated on May 26 2026 8:06 AM

కంకిపాడు @ 48.2 డిగ్రీలు వడదడ! భానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్న జనం

కంకిపాడు @ 48.2 డిగ్రీలు
భానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్న జనం

ఉమ్మడి కృష్ణాలో సోమవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగాయి. కాగా రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు ఉయ్యూరులో 46.6డిగ్రీలు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉంగుటూరుల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో 46.3, నందిగామలో 45.9, వీరులపాడులో 45.7, విజయ వాడలో 44.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. వచ్చే నాలుగు రోజుల్లో కూడా వడగాడ్పులు విజృంభిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement