విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026 ఆక్రమణలు ఇలా... పులిచింతల సమాచారం దుర్గమ్మకు పూర్వ ఈఓ విరాళం ఏఐతో సైబర్‌ నేరాల నియంత్రణ కార్తికేయుని ఆలయానికి రూ.లక్ష విరాళం బస్టాండ్‌లో కలెక్టర్‌ తనిఖీలు వైద్యులు కచ్చితంగా సమయపాలన పాటించాలి నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత

న్యూస్‌రీల్‌

కనుమరుగవుతున్న నాగార్జున సాగర్‌ కాలువలు కొన్నేళ్లుగా జోన్‌–3లో చివరి ఆయకట్టుకు అందని సాగర్‌ జలాలు సాగునీరు ప్రవహించని కాలువలను ఆక్రమిస్తున్న రియల్టర్లు మైనర్‌ కాలువలను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కలిపేస్తున్న వైనం వెంచర్లకు ప్రధాన రహదారులుగా మారుతున్న మేజర్‌ కాలువ గట్లు

ప్రభుత్వానిదే కాలువల బాధ్యత

జి.కొండూరు మండలం వెల్లటూరు గ్రామ శివారులో ఉన్న మైనర్‌ సాగర్‌ కాలువను పూర్తిగా మాయం చేశారు. ఈ భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేందుకే ఈ కాలువను పూర్తిగా పూడ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల జి.కొండూరులో సాగర్‌ మైనర్‌ కాలువ గట్టును చదును చేసి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు ప్రధాన రహదారి ఏర్పాటు చేస్తుండగా అధికారులు అడ్డుకొని నోటీసులు జారీ చేశారు. అయితే మళ్లీ ఇక్కడ రహదారిని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా యని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆత్కూరు గ్రామ శివారులో నిరుపయో గంగా ఉన్న సాగర్‌ మైనర్‌ కాలువను సరిహద్దు రైతులు పూర్తిగా తమ వ్యవ సాయ భూముల్లో కలిపేశారు. కల్వర్టులు మినహా కాలువ నామరూపాలు కోల్పోయింది. అధికారులు పరిశీలించినప్పటికీ ఏడాదిగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

కంచికచర్ల మండల పరిధి పరిటాల శివారు దొనబండ రాతి క్వారీల వద్ద సాగర్‌ ఇబ్రహీంపట్నం మేజరు కాలువను క్వారీల నిర్వహకులు ఆక్రమించారు. కాలువను పూడ్చి రహదారిని ఏర్పాటు చేశారు. దీనిపై రైతులు నిరసన తెలపడంతో అధికారులు స్పందించి పూడ్చిన కాలువను తెరిపించారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిరుపయోగంగా ఉన్న సాగర్‌ కాలువలు పూర్తిగా ఆక్రమణలకు గురై కనుమరుగవుతున్నాయని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026
ఆక్రమణలు ఇలా...

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఆలయ పూర్వ ఈఓ డి.భ్రమరాంబ అమ్మవారి అన్నదానానికి సోమవారం రూ.1.01 లక్షల విరాళం సమర్పించారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్‌ నేరాల నియంత్రణకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగించేందుకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. నేరాలు జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఖాకీ స్టూడియోను ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక కానిస్టేబుల్‌కు ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ కార్యక్రమం సోమ వారం ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సాంకేతికత ఎంత వేగంగా అభి వృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు పోలీస్‌ శాఖ సాంకేతికంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్న అనే కోణంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఎన్టీఆర్‌ పోలీస్‌ ఖాకీ స్టూడియో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సమాజంలో సైబర్‌ భద్రత, మహిళల భద్రత, పిల్లల సంరక్షణ, రోడ్డు భద్రతపై ఒక బలమైన బాధ్యతాయుతమైన సంస్కృతిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షిరీన్‌బేగం, కె.జి.వి. సరిత, కె.కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ రాజేష్‌, భాను దంపతులు సోమ వారం రూ.1,00,116 విరాళం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారి బర్మా ప్రసాద్‌, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బస్టాండ్‌(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌ను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ సొమవారం సాయంత్రం తనిఖీ చేశారు. బస్టేషన్‌లోని ఎరైవల్‌ బ్లాక్‌, డిపార్చర్‌ బ్లాక్‌, సిటీ టెర్మినల్‌లోని వివిధ ప్లాట్‌ఫాంలను పరిశీలించారు. వేపవిలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యలపై ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మంచినీటి సౌకర్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని చొట్ల తాగునీటి కూలర్లును ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా లని ఆదేశించారు. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు ఫ్యాన్‌లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితిల్లో ఉన్న ప్రయాణికులకు వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డెప్యూటీ సీటీఎం పవన్‌కుమార్‌, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు కచ్చితంగా సమయపాలన పాటించాలని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని ఆదేశించారు. జిల్లాలో పీహెచ్‌సీల్లో కొత్తగా చేరిన వైద్యులు, యూపీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో కొత్తగా చేరిన వైద్యులకు విధులపై దిశా నిర్దేశం చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ అభ ఐటీ (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) క్రియేట్‌ చేయా లని, మొదటిగా స్టాఫ్‌నర్సు లాగిన్‌లో ఎంటర్‌ చేసి, వైద్యాధికారి లాగిన్‌ ద్వారా వారిని పరీక్షించాలని సూచించారు. ఈ సదస్సులో ఉప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఇందుమతీదేవి, డీఐఓ డాక్టర్‌ శరత్‌బాబు, డీపీఎంఓ డాక్టర్‌ నవీన్‌, ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్‌ మాధవి నాయుడు, డీపీఓ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మంగళవారం నుంచి మూసివేయనున్నారు. ఘాట్‌రోడ్డులో జూన్‌ 12వ తేదీ వరకు మరమ్మతులు కొనసాగనున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో ఈ పనులను చేపట్టినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఘాట్‌ రోడ్డుపైకి ఎటు వంటి వాహనాలను అనుమతించేది లేదని ఆలయ ఈఓ శీనానాయక్‌ ప్రకటించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మహామండపం మెట్లు, లిఫ్టు మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయ మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఘాట్‌ రోడ్డు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల నేపథ్యంలో భక్తులు దేస్థానానికి సహకరించాలని కోరారు.

జి.కొండూరు: నాగార్జున సాగర్‌ కాలువకు వాటా ప్రకారం సాగు నీరు తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. కాలువలను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు. ఇదే అదునుగా పంటపొలాలకు జీవజలం అందించాల్సిన కాలువలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. కాలువలను పూడ్చి వెంచర్లలో కలిసేస్తున్నారు. మైనర్‌, సబ్‌ మైనర్‌ కాలువలు పూర్తిగా మాయమైపోతుండగా మేజర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కాలువలు ఆక్రమణకు గురై రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు ప్రధాన రహదారులుగా మారుతున్నాయి.

పూర్వ వైభవం లేక...

నాగార్జున సాగర్‌ ఎడమ ప్రధాన కాలువగా పిలవబడే లాల్‌ బహుదార్‌ కాలువ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చివరి ఆయకట్టు వరకు 179 కిలో మీటర్లు మేర ఉంది. ఈ ప్రధాన కాలువ కింద ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4,04,760 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రధాన కాలువ నుంచి మేజర్‌ డిస్ట్రిబ్యూటర్లు, మైనర్‌లు, సబ్‌ మైనర్‌ కాలువలు తిరువూరు నియోజకవర్గంలో 92 కిలోమీటర్ల మేర, మైలవరం నియోజకవర్గంలో 66.802 కిలోమీటర్లు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 174 కిలోమీటర్లకు మేర విస్తరించి ఉన్నాయి. అయితే రాష్ట్ర పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాటా కింద రావాల్సిన సాగునీరు సక్రమంగా అండంలేదు. దీంతో పాటు జోన్‌–3లో ఉన్న చివరి ఆయకట్టుకు ఆసలు నీరే రాకపోవడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న జోన్‌–2,3 పరిధిలో కాలువలు దశాబ్దాలుగా నిరుపయోగంగా మారాయి. ఈ కాలువల నిర్వహణను సైతం ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో నిరుపయోగంగా ఉన్న కాలువలను రియల్టర్లు, కాలువలను ఆనుకొని ఉన్న రైతులు ఆక్రమించడంతో అవి కనుమరుగువుతున్నాయి.

భవిష్యత్తు ప్రశ్నార్థకమే...

సాగర్‌ కాలువలు మాయమైపోతే భవిష్యత్తులో సాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. సాగర్‌ కాలువ జోన్‌–3 పరిధిలోని తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడరూరల్‌, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచిక చర్ల, వీరులపాడు మండలాల్లో ఎక్కువగా సాగర్‌ కాలువలు మాయమైపోతున్నాయి. ఒకవేళ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే జోన్‌–3 కింద ఉన్న ఈ మండలాల పరిధిలోని సాగుభూమికి ఈ కాలువల ద్వారానే సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాలువలు కనుమరుగైపోవడం వల్ల మళ్లీ కాలువలు తవ్వాల్సి వస్తే అదనంగా ఖర్చుతో పాటు నీటి సరఫరా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

భద్రాచలం నేషనల్‌ హైవేపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు

ఎ.కొండూరు: దీర్ఘకాలంగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఎంఎస్‌ఎంఈలకు ఏకపక్షంగా ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో సోమవారం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మండలంలోని చీమలపాడు రెవెన్యూలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న 318 ఎకరాలకు పైగా రైతుల భూములను దొడ్డిదారిన ఎంఎస్‌ఎంఈలకు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా, ఆన్‌లైన్‌లో భూములను తొలగిస్తూ, సర్వే నంబ ర్లను మార్చేస్తూ అధికారులు తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రామ చంద్రాపురం సమీపంలోని రిజర్వు అటవీ భూమిలో చెట్టుపట్టాల కింద సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు అధికారపార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రికార్డుల్లో అటవీ భూమిగా ఉన్నప్పటికీ ఎంఎస్‌ఎంఈలకు అక్రమంగా ఎలా కేటా యిస్తారని ప్రశ్నించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్పు చేసి ఎంఎస్‌ఎంఈలకు కట్ట బెట్టేందుకు రికార్డులు తారుమారు చేశారని విమర్శించారు.

హడావుడిగా శంకుస్థాపనకు ఏర్పాట్లు

ఎంఎస్‌ఎంఈ సంస్థలకు భూములు పంపిణీ చేసి, ఆ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం సాయంత్రం అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రినుంచే శంకుస్థాపన ఏర్పాట్లను అడ్డుకు న్నారు. అయినప్పటికీ భూములను పంపిణీ చేసేందుకు సోమవారం ఉదయం యత్నించడంతో భద్రాచలం జాతీయ రహదారిపైకి చేరుకొని బైఠాయించి దిగ్బంధించారు. దీంతో అధికారులు ఎంఎస్‌ఎంఈలకు భూకేటాయింపు వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘ జిల్లా నాయకుడు ఆంజనేయులు, జిల్లా కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఆనంద రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌. సుధాకర్‌, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.అమ్మిరెడ్డి రైతులకు సంఘీభావంగా నిలిచారు.

మండుటెండ.. ప్రొటోకాల్‌ తంటా

అసలే బెజవాడలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో ఎండ మంటలు పుట్టిస్తోంది. సోమవారం మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బందరు రోడ్డులో పోలీసులు ప్రొటోకాల్‌ పేరుతో ట్రాఫిక్‌ను నిలిపేశారు. సీఎం చంద్రబాబు ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మార్గంతోపాటు రెండో వైపునా వాహనాలను ఆపేశారు. మండుటెండలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – కిషోర్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

7

జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ

సాగర్‌ కాలువలను కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జోన్‌–3లో ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్న చివరి ఆయకట్టుకు కొన్నేళ్లుగా సాగర్‌ జలాలు రావడంలేదు. కాలువల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. ఇప్పటికే పలు చోట్ల కాలువలు పూర్తిగా మాయమయ్యాయి. కాలువలు పూర్తిగా కనుమరుగైతే భవిష్యత్‌లో ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది.

– ఏలూరి శివాజీ, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, ఎన్టీఆర్‌ జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement