అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా ఆయా సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దే శించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 124 అర్జీలు అందాయన్నారు. వీటిలో పోలీస్‌ శాఖకు సంబంధించి అత్యధికంగా 24 అర్జీలు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 23, ఎంఏయూడీ 14, పంచాయతీ రాజ్‌ 11, సాంఘిక సంక్షేమం 9, విద్య 8, పౌర సరఫరాలు 6, డీఆర్‌డీఏ 5, ఉపాధికల్పన 4, ఏపీ సీపీడీసీఎల్‌ 3, హెల్త్‌ 2, గ్రామీణ నీటి సరఫరా 2, విభిన్న ప్రతిభావంతులు 2, సహకార 2, కార్మిక 2, హౌసింగ్‌, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌, అటవీ, వక్ఫ్‌ బోర్డు, ప్రజా రవాణా, దేవదాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు.

జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ

Advertisement
 
Advertisement
Advertisement