పెడన: మండలంలోని నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఆదివారం ఏపీ హైకోర్టు పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ బీఆర్‌ఎస్ రెడ్డి, అడ్మిన్ పి. అశోక్‌కుమార్ తెలిపారు. మూడు షిప్టులలో జరిగిన ఈ పరీక్షకు 540 మందికి 364 మంది హాజరవ్వగా 176 మంది ఆబ్సెంట్ అయ్యారన్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 120 మంది హాజరవ్వగా 60 మంది రాలేదని తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 118 మంది హాజరవ్వగా 62 మంది ఆబ్సెంట్ అయ్యారని పేర్కొన్నారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 126 మంది హాజరవ్వగా 54 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
మచిలీపట్నంఅర్బన్: స్థానిక వైజేఆర్ డీఎంఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఏపీ హైకోర్టు సర్వీసెస్ పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగిందని సెంటర్ హెడ్ ఎండీ నజీబ్ అహ్మద్ తెలిపారు. మొత్తం 300 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 177 మంది హాజరై పరీక్ష రాశారని, 123 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించగా, 100 మందికి 65 మంది హాజరై, 35 మంది గైర్హాజరయ్యారు. రెండో షిఫ్ట్‌లో 100 మందికి 52 మంది హాజరై, 48 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మూడో షిఫ్ట్‌లో 100 మందికి 60 మంది హాజరై, 40 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.


