పెట్రోల్‌ ధరల విషయంలో చంద్రబాబు హామీ ఏమైంది | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ధరల విషయంలో చంద్రబాబు హామీ ఏమైంది

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

పెట్రోల్‌ ధరల విషయంలో చంద్రబాబు హామీ ఏమైంది పెనుభారం

పెనుభారం

ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రోజు ప్రజలపై అసలైన బాదుడును మొదలుపెట్టారు. రోజుకో రూపాయి చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేస్తోందకటి. పెంచిన ధరలు తగ్గించాలి.

– కామరాజ్‌హరీష్‌, బీసీ నేత

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల విషయంలో మోదీ మోసం సరే.. చంద్రబాబు హామీ ఏమైంది? వీటి ధరలను వరుసగా పెంచడం దేశ ప్రజలను మోసం చేయడమే. ప్రభుత్వం సీఎన్జీ ధరలను రెండుసార్లు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మూడుసార్లు పెంచింది. ఎన్నికలకు ముందు పెట్రోల్‌ ధరల గురించి చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించకపోగా వరుసగా పెంచుతున్నారు. రాష్ట్రం విచ్చలవిడిగా పన్నులు విధించడమే ధరల పెరుగుదలకు కారణం. అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ధరలు తగ్గించాలి.

–దాది శ్రీనివాసరావు, ఇఫ్టూ

Advertisement
 
Advertisement
Advertisement