గ్రీనరీని అభివృద్ధి చేయకండా నగరం కాంక్రిట్ జంగిల్‌లా ఉంటే, రానున్న రోజుల్లో పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పుటికే అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో అనువైన ప్రాంతాల్లో మొక్కలు పెంచాలి. గ్రీన్ హైవేస్ పాలసీ ఆధారంగా జాతీయ రహదారుల వెంబడి ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కిలోమీటర్‌కు 333 మొక్కలను పెంచాల్సి ఉంది. మొక్కలు పెంచడంతో పక్షుల జాతులను కాపాడుకొని, జీవ వైవిధ్యానికి ముప్పలేకుండా చూడవచ్చు.
– డాక్టర్ తుమ్మల శ్రీకుమార్, పర్యావరణ నిపుణులు


