కార్తికేయుని ఆలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కార్తికేయుని ఆలయంలో భక్తుల రద్దీ

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

కార్తికేయుని ఆలయంలో భక్తుల రద్దీ సినీ ఫక్కీలో కారు పల్టీ.. తప్పిన పెను ప్రమాదం వీకెండ్‌ సరదాలో విషాదం

మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: చైన్నె – కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్‌ శివారులోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సినిమా స్టంట్స్‌ను తలపించేలా కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో గాల్లో పైకి లేచి, మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడింది. ఏలూరు వైపు వెళ్తున్న కారు హైవే మధ్యలోని డివైడర్‌ను దాటుకుని అవతల వైపు రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. కారు నుజ్జునుజ్జకావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగి కారు ధ్వంసమైనప్పటికీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు మినహా, ఆ కారులోని మిగిలిన ప్రయాణికులకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు. పల్టీలు కొట్టిన కారులో నుంచి అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటకు రావటం ప్రమాద ఘటన చూసిన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న ఈ కారు టైర్‌ పంక్చర్‌ కావటంతో ప్రమాదం జరిగింది.

కర్ణాటకలో విజయవాడ టెక్కీ మృతి

యశవంతపుర: సరదాగా వీకెండ్‌ గడుపుదామనుకున్న టెక్కీ మృతి చెందారు. నదిలో రబ్బరు బోటులో వేగంగా విహరించే సమయంలో అనూహ్యంగా విద్యుత్‌ షాక్‌ కొట్టి ఐటీ ఇంజినీర్‌ మృతి చెందిన ఘటన కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా జోయిడా తాలూకా గణేశగుడి వద్ద కాళీ నదిలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన మహేశ్‌ (27) మృతుడు. ఈయన బెంగళూరులో టెక్కీగా పనిచేసేవాడు. వీకెండ్‌ కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఓ రిసార్ట్‌లో బస చేసి, అక్కడే నదిలో రాఫ్టింగ్‌ చేయడానికి వెళ్లారు. నదిలో నుంచి పడవలోకి ఎక్కుతుండగా పక్కనే రిసార్టుకు చెందిన పెద్ద పంపుసెట్టు నుంచి విద్యుత్‌ నీటిలో ప్రసారమైంది. దీంతో మహేశ్‌కు షాక్‌ తగిలి నీట మునిగి మరణించాడు. మిగతా వారికి కూడా షాక్‌ తగిలింది కానీ అంత ప్రభావం చూపించలేదు. అతడి మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రాఫ్టింగ్‌ చేసే ప్రాంతాలలో ఇలాంటి పంపుసెట్ల అమర్చవద్దని స్థానికులు హెచ్చరించినా రిసార్ట్‌ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement