అనుమానాస్పద స్థితిలో బిహార్‌ వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో బిహార్‌ వాసి మృతి

May 25 2026 9:45 AM | Updated on May 25 2026 9:45 AM

చిట్టేల(వత్సవాయి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం గ్రామ శివారులోని రైస్‌మిల్లు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బిహార్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌కిషన్‌మహతి(42) నెల రోజుల క్రితం రైస్‌మిల్లులో హమాలీగా పని చేయడానికి వచ్చాడు. నెల రోజులు పనిచేసిన తరువాత వేరే చోట పనికి వెళ్లాడు. మరలా తిరిగి శనివారం సాయంత్రం మరలా చిట్టేల గ్రామంలో గతంలో పనిచేసిన రైస్‌మిల్లు వద్దకే వచ్చాడు. రాత్రి 9 గంటల సమయం వరకు తోటి కూలీలతో పని చేసి భోజనం కూడా చేశాడు. కాగా ఆదివారం సాయంత్రం రైస్‌మిల్లు సమీపంలోని చెట్టు కింద రామ్‌కిషన్‌మహతి మృతదేహాం ఉండడాన్ని తోటి కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జగ్గయ్యపేట ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్య పేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసునమోదు చేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement