న్యూస్‌రీల్
గ్రామస్తుల ఫిర్యాదులు బుట్టదాఖలు...
కుక్కడపు నియామకం
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026
కొండల గుండెల్లో
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు.
భానుడి ప్రతాపానికి జనం తల్లడిల్లి పోతున్నారు. వదాన్యులు ఏర్పాటుచేసిన చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి.
పెట్టుబడిదారులకు అండగా
ప్రత్యేకంగా ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా చేయూతనందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ డెస్క్ ను అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఇన్వెస్టర్స్ డెస్క్ – సింగిల్ విండో సెల్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా చేయూతనందిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, లైసెన్సులు, శాఖల సమన్వయం వంటి అంశాలలో సులభతర సేవలు అందించడంతో పాటు, వివిధ రకాల సేవలకు మార్గనిర్దేశనం చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, ప్రోత్సాహకాలు వంటి సమాచారాన్ని అందించడంతో పాటు పారిశ్రామిక యూనిట్లను విజయవంతంగా నడిపించేందుకు మార్గదర్శనం లభిస్తుందని వివరించారు. పరిశ్రమలు నడపటంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటి పరిష్కారానికి చేయి పట్టి నడిపిస్తామన్నారు. జిల్లాలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, కొత్త పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలనుకునే పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు అనువైన, అవసరమైన భూమిని సమకూర్చడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మరిన్ని వివరాలకు డీఐసీ జనరల్ మేనేజర్ ఎం.మధు (98857 29555), ఇన్వెస్టర్ డెస్క్ ఇన్‌చార్జ్ డాక్టర్ సుమన్ (94943 75951)ను సంప్రదించవచ్చని తెలిపారు.
జి.కొండూరులో సీబీజీ ప్లాంటు
ఎన్టీఆర్ జిల్లాలో ఐవోసీ–జీపీఎస్ సంస్థ స్థాపించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటు ప్రతిపాదనకు ఆమోదం లభించిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ పరిశ్రమ జి.కొండూరు మండలంలోని కడింపోతవరం గ్రామ పరిధిలో రానుందని, ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు రూ.120 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు, 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వివరించారు.
7
విస్సన్నపేట: ఆర్యవైశ్య మహాసభ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విస్సన్నపేటకు చెందిన కుక్కడపు వెంకట నాగేశ్వరరావునియమితులయ్యారు.
ఎత్తైన కొండలు. కొండలను చుట్టుకుని మెలికలు తిరిగే పోలవరం కాలువ. ప్రకృతి సోయగాలు. ఎన్నో రకాల వన్య ప్రాణులు. పశు పక్ష్యాదులు. పచ్చటి పంట పొలాలు, పండ్ల తోటలతో అలరారే గ్రామం కొత్తూరు తాడేపల్లి. ఆ ప్రకృతి సౌందర్యమే ఇప్పుడా గ్రామానికి శాపంగా మారింది. గ్రావెల్, మట్టి పేరుతో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అక్రమార్కులు గ్రావెల్ కోసం కొండలు, గుట్టలను బాంబులతో పేల్చేస్తున్నారు. బాంబుల ధాటికి చుట్టు పక్కల పంట పొలాలు, తోటల్లోకి రాళ్లు ఎగిరి పడుతున్నాయి. దుమ్ము, మట్టి పంట పొలాలను కప్పేస్తున్నాయి. గ్రామస్తులు గ్రావెల్ దందాపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.
అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం
గ్రావెల్ కోసం కొండలు,
గుట్టలు పేల్చివేత
అనుమతి లేకుండా
ఎక్స్‌ప్లోజివ్స్ వాడకం
బాంబుల ధాటికి ఎగిరిపడుతున్న రాళ్లు
దుమ్ము, మట్టితో పంట చేలు నాశనం
కన్నెత్తి చూడని అధికారులు
భయభ్రాంతులకు గురవుతున్న
గ్రామాల ప్రజలు


