గ్రామ స్థాయిలోనే పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

గ్రామ స్థాయిలోనే పరిష్కారానికి కృషి

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

రెడ్డిగూడెం: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగంగా పరిష్కరించి, రెవెన్యూ సమస్యల రహిత గ్రామాల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. ఆయన శుక్రవారం రెడ్డిగూడెంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)తో పాటు ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో మొత్తం 57 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 23 అర్జీలు, గృహ నిర్మాణం, పంచా యతీ రాజ్‌ శాఖకు సంబంధించి ఆరు చొప్పున అర్జీలు అందాయి. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 5 అర్జీలు, విద్యాశాఖ 3, మైనింగ్‌, పోలీసు, డీఆర్‌డీఏ శాఖలకు ఆరు చొప్పున అర్జీలు వచ్చాయి.

తహసీల్దార్‌ సుశీలాదేవిపై సీరియస్‌...

రెడ్డిగూడెం మండలం నాగులూరు తండాకు చెందిన బాణావత్‌ వనజ తనకు చెందిన డి.పట్టా భూమిని అడంగల్‌లో నమోదు చేయడం లేదని కలెక్టర్‌కు మొరపెట్టుకోగా కలెక్టర్‌ తహసీల్దార్‌ సుశీలాదేవిని పిలిచి ఆ భూమిపై వారు పెట్టుకున్న అర్జీలను చూపాలని అడిగారు. తహసీల్దార్‌ సరైన పత్రాలు చూపించకపోవడంతో కలెక్టర్‌ ఆమైపె మండిపడ్డారు. సరైన పట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు తాత్సారం చేస్తున్నారని తహసీల్దార్‌ను సీరియస్‌గా ప్రశ్నించి, పక్కనే ఉన్న ఆర్డీవోను ఈ పట్టా భూమిని పరిశీలించి ఆమెకు తగు న్యాయం చేయాలని సూచించారు. ఒకానొక సందర్భంలో పక్కనే ఉన్న తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్‌తో వెంటనే తహసీల్దార్‌ సస్పెన్షన్‌ ఆర్డర్‌ తయారు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన చింతిరాల శివ చెట్టు మీద నుంచి పడి వెన్నుపూస దెబ్బతిని లేవలేని పరిస్థితి లో ఉన్నాడని కలెక్టర్‌కు తెలుపగా, అతడిని పరామర్శించి పెన్షన్‌ అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్‌, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి జ్యోతి, తహసీల్దార్‌ జె.సుశీలాదేవి, ఎంపీడీఓ జె.ప్రభాకరరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

డి.పట్టా భూమిని పరిశీలించిన అధికారులు

రెడ్డిగూడెం మండలం నాగులూరు తండాకు చెందిన బాణావత్‌ వనజ డి.పట్టా భూమిని తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్‌, ఎస్‌ఐ ఎస్‌.శ్రీను, తహసీల్దార్‌ జె.సుశీలాదేవి పరిశీలించారు. వనజ భూమిని పరిశీలించి కొలతలు వేసి కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఆర్డీఓ కుమార్‌ తెలిపారు.

కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement
 
Advertisement
Advertisement