పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెరగాలి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెరగాలి

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీ (ప్రసవాలు) పెరగాలని వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని సూచించారు. ఆమె శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లాలోని రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు. ప్రతిరోజూ ఆస్పత్రికి వచ్చే అవుట్‌ పేషెంట్స్‌ వివరాల అడిగి తెలుసుకోవడంతో పాటు, రికార్డులు తనిఖీ చేశారు. వైద్యాధికారితో పాటు, సిబ్బంది హాజరు. పనితీరు, ప్రగతి నివేదికలను పరిశీలించారు. స్టాఫ్‌ నర్సును పిలిచి ఆస్పత్రికి వచ్చే గర్బిణుల వివరాలు, ప్రతినెలా జరిగే పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమానికి హాజరవుతున్నారా లేదా అనే అంశాలను తెలుసుకున్నారు. ఈ పీహెచ్‌సీ పరిధిలో ఈ వారంలో జరిగే కాన్పు వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారితో పాటు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని

Advertisement
 
Advertisement
Advertisement