● 4031 మద్యం సీసాలు, 2422 బీర్‌ బాటిళ్లు పట్టివేత ● జనార్దనపురంలో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

● 4031 మద్యం సీసాలు, 2422 బీర్‌ బాటిళ్లు పట్టివేత ● జనార్దనపురంలో ముగ్గురి అరెస్ట్‌

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

● 4031 మద్యం సీసాలు, 2422 బీర్‌ బాటిళ్లు పట్టివేత ● జనార్దనపురంలో ముగ్గురి అరెస్ట్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో బస్సు డ్రైవర్‌ అరెస్ట్‌ ఎకై ్సజ్‌ దాడుల్లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం నందివాడ: జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని జనార్దనపురం గ్రామంలో ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించి భారీగా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని కెనరా బ్యాంక్‌ పక్కన ఉన్న ఓ షాపులో అనధికారికంగా నిల్వ ఉంచిన 4,031 మద్యం సీసాలు, 2,422 బీర్‌ సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ సీహెచ్‌ అరుణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారని చెప్పారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, అమ్మకాలు సాగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే గ్రామస్తులు తమకు సమాచారం అందించాలని సీఐ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి రిమాండ్‌ పొడిగింపు విజయవాడలీగల్‌: అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.శాంతి రిమాండ్‌ మంగళవారం ముగియడంతో పోలీసులు ఆమెను సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరిచారు. శాంతి రిమాండ్‌ను వచ్చే నెల రెండో తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్‌ మోపిదేవి: మండలంలోని బోడగుంట గ్రామానికి చెందిన బాలికపై 55 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు.. బోడగుంట గ్రామానికి చెందిన 55 ఏళ్ల మోటుపల్లి చింతయ్య అదే గ్రామానికి చెందిన బాలికపై సోమవారం లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లికి విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ఆదేశాల మేరకు అవనిగడ్డ ఎస్‌డీపీఓ అభిషేక్‌ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో మోపిదేవి ఎస్‌ఐ గౌతమ్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం వెంకటాపురం నుంచి చల్లపల్లి వెళ్లే రోడ్డులో నిందితుడు చింతయ్య, అతనికి సహకరించిన ఆర్‌ఎంపీని అరెస్ట్‌ చేసి మోపిదేవి ప్రధాన సెంటర్‌ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువచ్చారు. ఇద్దరు నిందితులను బుధవారం కోర్టులో హాజరు పరుస్తామని ఎస్‌ఐ గౌతమ్‌కుమార్‌ తెలిపారు. పాయకాపురంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కృష్ణలంక(విజయవాడతూర్పు): మద్యం సేవించి ట్రావెల్స్‌ బస్సు నడుపుతున్న డ్రైవర్‌పై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి బస్సును సీజ్‌ చేశారు. ఐదో ట్రాఫిక్‌ సీఐ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లాలోని రాజాం నుంచి శ్రీ విజయలక్ష్మి ట్రావెల్స్‌ బస్సు 40 మంది యాత్రికులతో షిరిడీ వెళ్లింది. తిరిగి అక్కడ నుంచి రాజాం బయలుదేరింది గుంటూరు నుంచి వారధి మీదుగా కనకదుర్గ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. మంగళవారం రాత్రి వారధి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు బస్సును ఆపి బస్సు డ్రైవర్‌ సురేష్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా మద్యం సేవించినట్లు తెలిసింది. డ్రైవర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి బస్సును సీజ్‌ చేశారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిని మరో బస్సులో రాజాం పంపించేశారు.

పాయకాపురం(విజయవాడరూరల్‌): పాయకాపురం ఫైర్‌ స్టేషన్‌ రోడ్డులో 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానిక వీఆర్వో చొక్కా కమల్‌కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఫైర్‌స్టేషన్‌ రోడ్డు నుంచి రాజీవ్‌నగర్‌ వెళ్లే రోడ్డులో మొబైల్‌షాపు పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని స్థానికులు చెప్పిన సమాచారంతో వీఆర్వో కమల్‌ కుమార్‌ సంఘటనా ప్రాంతానికి వచ్చి పంచనామా నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి మద్యం సేవించి వడదెబ్బ తగిలి పడిపోయి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కాఫీకలర్‌ ప్యాంట్‌, గ్రీన్‌ కలర్‌ పుల్‌హ్యాండ్‌ టీ షర్టు ధరించి ఉన్నాడు. మృతుని జేబులో ఆధార్‌కార్డుపై రాహుల్‌ సాయికియ, తండ్రి నబిన్‌, అసోం రాష్ట్రం గోగముఖ్‌ పోస్టు అని ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతనికి సంబంధించిన వారు నున్న పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement