కంకిపాడు: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగోన్నతులు త్వరితగతిన కల్పించాలని ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం కంకిపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ మూడేళ్లుగా ఉద్యోగోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రవాణా భత్యాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కృష్ణాజిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా శ్యామల, కార్యదర్శిగా ప్రమీలారాణి, ఉపాధ్యక్షురాలిగా రేణి రాజ్యం, ఉప కార్యదర్శిగా మంజుల, అసోసియేటెడ్ అధ్యక్షురాలిగా డి.నిర్మల ఎన్నికయ్యారు. ఏలూరు జిల్లా అధ్యక్షురాలు మోహనబాయి, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు.


