లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ అభివృద్ధికి అసలైన శక్తి కార్మికులేనని, సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(మేడే)ను పురస్కరించుకుని గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డితో కలిసి దేవినేని అవినాష్ ట్రేడ్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ శారు. వేడుకల్లో పాల్గొన్న కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని పూనూరు గౌతంరెడ్డి అన్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి, జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షుడు శెటికం దుర్గాప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నత్తా యోనారాజు, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి హరీష్, పార్టీ నేతలు లంకా అబ్బినాయుడు, గొర్ల గోవిందుబాబు, బి.రాజేష్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
● కార్మికుల సంక్షేమానికి
వైఎస్సార్ సీపీ ప్రాధాన్యం
● మేడే వేడుకల్లో ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షుడు దేవినేని అవినాష్
● గుణదలలోని జిల్లా కార్యాలయంలో
పార్టీ ట్రేడ్ యూనియన్ పతాకం
ఆవిష్కరణ
కార్మికుల సంక్షేమం విస్మరించిన
చంద్రబాబు : గౌతంరెడ్డి