అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

Mar 25 2026 7:32 AM | Updated on Mar 25 2026 7:32 AM

u8లో అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి కొంత మార్పు.. కొత్త రూపు బోట్‌తో కృష్ణా వర్సిటీ అవగాహన

న్యూస్‌రీల్‌

1.60 లక్షల మంది ఓటర్లు ఉండేలా.

పునర్విభజనతో రూపు మారనున్న నియోజకవర్గాల ముఖచిత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెరగనున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా మరో పార్లమెంటు స్థానం ఏర్పాటయ్యే అవకాశం మరిన్ని ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటు మహిళలకు 5 నియోజకవర్గాలు ఖరారయ్యేందుకు అవకాశం విజయవాడ పరిసరాల్లో ఎక్కువగా కొత్త నియోజకవర్గాలు

విజయవాడ సెంట్రల్‌

విజయవాడ తూర్పు

ఎన్టీఆర్‌ జిల్లాలో ఓటర్లు ఇలా..

ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఓటర్ల సంఖ్య ఇలా..

బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
u8లో

సాక్షి, ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖచిత్రం మరోసారి మారనుంది. కొత్తగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్తగా ఒక లోక్‌సభ స్థానం ఏర్పాటు కానుంది. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 50 శాతం మేర పెరగనుంది. 2011 జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లాలో 17.35 లక్షలు, ఎన్టీఆర్‌ జిల్లాలో 22.18 లక్షల చొప్పున మొత్తం 39.53 లక్షల మంది జనాభా ఉన్నారు. కృష్ణా జిల్లాలో 8.66 లక్షల మంది, ఎన్టీఆర్‌ జిల్లాలో 11.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వేషన్‌ చేయనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలో ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన అనంతరం వీటి సంఖ్య 21కి చేరుకోనుంది. లోక్‌సభకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ, మచిలీపట్నం పార్లీమెంటరీ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన తరువాత మరో కొత్త లోక్‌సభ స్థానం ఏర్పడ నుంది. మహిళలకు ఐదు శాసన సభ స్థానాలు రిజర్వు కానున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాలో పలు నియోజకవర్గాల స్వరూపాల్లో సైతం మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని నియోజకవర్గాల పేర్లు మారే అవకాశం ఉంది.

విజయవాడ పరిసరాల్లోనే మార్పులు..

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని విజయవాడ నగరంలో ప్రస్తుతం విజయవాడ తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. నగరాన్ని ఆనుకుని ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని మైలవరం, కృష్ణా జిల్లా పరిధిలోని

గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే జనాభా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ చుట్టు పక్కలే కొత్తగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విజయవాడ రూరల్‌, భవా నీపురం, ఇబ్రహీంపట్నం, కృష్ణలంక, కానూరు ప్రాంతాలను కలుపుతూ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విజయవాడ నగరంలోని ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు, ఆరు నియోజకవర్గాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంచనా. కృష్ణా జిల్లాలో కంకిపాడుతోపాటు, గుడివాడ, పామర్రు మధ్య మరో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్య పేట, నందిగామ మధ్య మరో నియోజకవర్గం పెరిగే సూచనలు ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాలు కూడా మారే అవకాశం ఉంది.

లోక్‌సభ స్థానంపై చర్చ

అసెంబ్లీతోపాలు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఉమ్మడి జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కేంద్రాలుగా లోక్‌ సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన అనంతరం మరో స్థానం ఏర్పడనుంది. దీనిని ఏ పేరుతో ఏర్పాటు చేస్తారనే చర్చ సాగుతోంది. విజయవాడ నగరమే ఓ లోక్‌సభ స్థానంగా ఏర్పడుతుందని అంచనా. ఎన్టీఆర్‌ రూరల్‌ జిల్లా, విజయవాడ చుట్టు పక్కల ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోని ప్రాంతాలతో కొత్తగా లోక్‌సభ స్థానం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ పునర్విభజతో రాజకీ యంగా చైతన్య వంతమైన కృష్ణాలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి.

తిరువూరు

జగ్గయ్యపేట

నందిగామ

ౖమైలవరం

గన్నవరం

గుడివాడ

పెనమలూరు

పెడన

పామర్రు

మచిలీపట్నం

అవనిగడ్డ

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ అనుబంధ సంస్థ బోర్డు ఆఫ్‌ ఏప్రింటిషిప్‌ ట్రైనింగ్‌ (చైన్నె)తో కృష్ణా విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. విశ్వవిద్యాలయ ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఉపకులపతి ఆచార్య కె.రాంజీ సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.ఉష, బోట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజమణి రాజు మంగళవారం అవగాహన ఒప్పంద పత్రాలపై సంత కాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగ అవకాశాలను బోర్డు ఆఫ్‌ ఏప్రింటిషిప్‌ ట్రైనింగ్‌ సంస్థ కల్పించనుంది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇదొక సదవకాశం అని ఉపకుల పతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు.

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సమస్యల పరిష్కారంపై కమిషన్‌ చైర్మన్‌ మంగళవారం ఎన్టీఆర్‌ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో జవహర్‌ మాట్లాడారు. జిల్లాలో 51 అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. కలెక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌ సెక్రటరీ చిన రాముడు, సభ్యులు శ్రీపతి బాబు, డి.ఆర్‌.గౌతమ్‌, మేకల దాస్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.ఎల్‌.హర్షిత, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్‌ ఎ.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 1.60 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలతో పాటు, చుట్టూ పక్కల ఉన్న గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో రెండు లక్షల మందికిపైనే ఓటర్లు ఉండటం గమనార్హం. ఎస్సీ రిజర్వుడు స్థానాల సంఖ్యపెరగడం, నియోజకవర్గాల మార్పు జరుగుతుండటంలో ఉమ్మడది జిల్లా ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రధానంగా 2029 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఐదు సీట్లు మహిళలకు రిజర్వుడు కానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. జిల్లాలో ఎక్కడా చూసినా నియోజకవర్గాల పునర్విభజన పైనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఐదు సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. చివరిగా 2008వ సంవత్సరంలో జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తరువాత మరోమారు నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది.

విజయవాడ పశ్చిమ

అసెంబ్లీ పురుషుల మహిళల థర్డ్‌ జెండర్‌ మొత్తం

నియోజకవర్గం సంఖ్య సంఖ్య సంఖ్య

తిరువూరు (ఎస్సీ) 99,241 1,01,363 9 2,00,613

విజయవాడ వెస్ట్‌ 1,21,538 1,23,888 34 2,45,460

విజయవాడ సెంట్రల్‌ 1,32,902 1,38,615 59 2,71,576

విజయవాడ ఈస్ట్‌ 1,26,150 1,30,967 17 2,57,134

మైలవరం 1,30,824 1,37,943 18 2,68,785

నందిగామ (ఎస్సీ) 96,418 1,02,189 9 1,98,616

జగ్గయ్యపేట 94,936 1,02,021 11 1,96,968

మొత్తం 8,02,009 8,36,986 157 16,39,152

అసెంబ్లీ పురుషుల మహిళల థర్డ్‌ జెండర్‌ మొత్తం

నియోజకవర్గం సంఖ్య సంఖ్య సంఖ్య

గన్నవరం 1,35,478 1,46,504 9 2,81,991

గుడివాడ 97,987 1,07,036 13 2,05,036

పెడన 83,054 84,876 0 1,67,930

మచిలీపట్నం 94,836 1,01,946 10 1,96,792

అవనిగడ్డ 1,03,652 1,07,313 11 2,10,976

పామర్రు (ఎస్సీ) 88,721 94,906 3 1,83,630

పెనమలూరు 1,43,120 1,53,848 3 2,96,971

మొత్తం 7,46,848 7,96,429 49 15,43,326

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement