‘ఇది ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడమే’ | YSRCP MP Mithun Reddy Speaks During Finance Bill Debate | Sakshi
Sakshi News home page

‘ఇది ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడమే’

Mar 23 2026 7:06 PM | Updated on Mar 23 2026 7:36 PM

YSRCP MP Mithun Reddy Speaks During Finance Bill Debate

ఎంపీ మిథున్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించడాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభలో పైనాన్స్‌ బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దన్నారు. ‘ కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. కానీ వాస్తవానికి  పోలవరం ఒరిజినల్ ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం పోలవరం నిర్మించాలి. పోలవరం నిల్వ సామర్థ్యాన్ని 190 టీఎంసీల నుంచి 120 కి తగ్గించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు  అన్యాయం చేయడమే. ఆంధ్రప్రదేశ్ అప్పు రెండేళ్లలో 3 లక్షల 36,000 కోట్ల రూపాయలు దాటింది. ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. 

ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం  జోక్యం చేసుకోవాలి. ఏపీలో అత్యధిక 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ సగటు 5.2 ఉంటే ఏపీ ది అత్యధికంగా 8 శాతం ఉంది. మహిళల్లో నిరుద్యోగ రేటు 10% గా ఉంది. వైఎస్‌ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో 32 లక్షల పట్టాలు ఇచ్చి .. ఇల్లు మంజూరు చేశారు.  ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో 14 లక్షల 20 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2024 నుంచి 26 మధ్య టిడిపి ప్రభుత్వం రూ. 1165 కోట్ల రూపాయలను ఇల్ల నిర్మాణానికి  వినియోగించకుండా వదిలేసింది. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది

చాలామంది ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటకీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. రాజకీయాలు పక్కన పెట్టి పోలవరం కోసం  పనిచేసేందుకు ముందుకు వస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  వ్యతిరేకిస్తున్నాం. కొత్త స్టీల్ ప్లాంట్ కు సంబరాలు చేస్తున్న ప్రభుత్వం.... ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు చంపుతుంది?, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. కడప బెంగళూరు రైల్వే లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలి. చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ బకాయిలకు చిన్న వ్యాపారులను శిక్షించొద్దు. ఎంఎస్ఎమ్ఈలకు జీఎస్టీ ఇన్‌కమ్ టాక్స్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement