వ్యాపారం హోడల్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యాపారం హోడల్‌

Mar 23 2026 9:15 AM | Updated on Mar 23 2026 9:15 AM

సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం వివరాలు u8లో

న్యూస్‌రీల్‌

గ్యాస్‌ సిలిండర్‌ రూ.4 వేలు

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

భక్తజన సందడి

కార్మికులు రోడ్డున పడుతున్నారు

హోటల్స్‌ను ఆదుకోవాలి

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026

గ్యాస్‌ సరఫరా లేక

మూతపడుతున్న హోటల్స్‌

కార్మికులకు అవస్థలు

ప్రభుత్వాలు స్పందించాలంటున్న

సంఘాలు

7

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 535.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 18,541 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్‌ సిలిండర్లు నిలిపేయాలనే ఆదేశాలతో హోటళ్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ‘గ్యాస్‌ లేదు.. వ్యాపారం లేదు’ అంటూ వాపోతున్నారు. గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లు మూత పడుతున్నాయి. వ్యాపారులే కాకుండా హోటళ్లలో పని చేసే కార్మికులు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): గ్యాస్‌ కొరత తీవ్రంగా మారడంతో ఎన్టీఆర్‌ జిల్లాలో హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని చోట్ల పదార్థాలను అధిక ధరకు విక్రయిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో 15 రోజులుగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో హోటల్స్‌ రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డొమెస్టిక్‌ సిలిండర్‌లను కొందరు బ్లాక్‌లో విక్రయిస్తుండటంతో మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకాయి. హోటల్స్‌ యజమానులు కొనుగోలు చేయలేక దుకాణాలను మూస్తున్నారు.

జిల్లాలో వెయ్యికి పైగా హోటల్స్‌

జిల్లాలో సుమారు వెయ్యికి పైగా చిన్నా పెద్దా హోటల్స్‌, రెస్టారెంట్‌లు, బేకరీలు ఉన్నాయి. వీటన్నింటికీ గ్యాస్‌ చాలా ప్రధాన అవసరం. ఇవి కాక రోడ్డుపక్కన చిన్నపాటి టిఫిన్‌ సెంటర్‌లు వందలాదిగా ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా కమర్షియల్‌ గ్యాస్‌ను మాత్రమే వినియోగించాలి. అవి సరఫరా కాక కొంతమంది డొమెస్టిక్‌ బండలను బ్లాక్‌లో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. వీటిని కొనలేక నగరంలో చాలా హోటల్స్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బోర్డులు దర్శనమిస్తున్నాయి.

20 వేల మంది కార్మికులపై ప్రభావం

జిల్లాలో హోటల్‌ రంగ కార్మికులు సుమారుగా 20 వేల వరకూ ఉంటారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గ్యాస్‌ లేక వీరి ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. హోటల్స్‌ మూసి వేస్తుండటంతో రోడ్డున పడుతున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్‌ పుడ్‌ సరఫరా చేసే వారిపై దీని ప్రభావం పడుతుందని కార్మిక సంఘాల నేతలు వివరిస్తున్నారు.

తగ్గిన వంటకాల సంఖ్య

చిన్న హోటల్స్‌ తాత్కాలికంగా మూసివేస్తుంటే పెద్ద హోటల్స్‌ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. సరఫరా చేసే వంటకాల సంఖ్యను తగ్గిస్తున్నాయి.

కట్టెలు, కరెంట్‌ పొయ్యిలతో..

గ్యాస్‌ కొరతతో చాలా హోటల్స్‌ కట్టెల పొయ్యిలపై దృష్టి సారించాయి. అవకాశం ఉన్న హోటల్స్‌ వారి ప్రాంగణాల్లో కట్టెలను తెప్పించి పొయ్యిలను పెడుతున్నాయి. కొన్ని ఇతర ప్రాంతాల్లో తయారు చేసి హోటల్స్‌కు తెప్పించుకుంటున్నాయి. భారీ వినియోగం ఉన్న వారు స్టీమ్‌ లేదా బాయిలర్‌లను వినియోగిస్తుండటం, కొన్ని క్యాంటిన్లు కరెంట్‌తో నడిచే పొయ్యిలతో టీ వంటి వాటిని అందిస్తున్నాయి.

గ్యాస్‌ బుకింగ్‌ గడువు పెంపు

ప్రభుత్వం గ్యాస్‌ బుకింగ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచింది. జిల్లాలో 56 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. అవి నెలకు లక్షన్నర వరకూ గృహావసర సిలిండర్‌లను సరఫరా చేస్తుండగా సుమారు 50 వేల వరకూ కమర్షియల్‌ సిలిండర్‌లను ఇస్తున్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్‌ సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వారు 25 రోజుల తర్వాత, డబుల్‌ సిలిండర్‌ ఉన్న కుటుంబాలు 30 రోజుల తర్వాతే బుకింగ్‌ చేసుకోవచ్చు.

పొత్తుకుదరని మద్దతు

ఆంధ్ర నాట్య సంగమంలో కళాకారుల నృత్య ప్రదర్శన

ప్రస్తుతం కమర్షియల్‌ సిలిండర్‌ సరఫరా నిలిపివేయడంతో గృహావసరాలు, విద్యాసంస్థలు, ఆలయాలు వంటి ప్రాధాన్య రంగాలకు మాత్రమే సరఫరాను కొనసాగిస్తున్నారు. దీంతో బయట మార్కెట్‌లో గృహావసరానికి వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.3,500 నుంచి నాలుగు వేల మధ్య ఉందని హోటల్స్‌ యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ఒక్కసారిగా అందరూ గ్యాస్‌ బుకింగ్‌ చేస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా పిర్యాదుల పరిష్కారవేదిక( పీజీఆర్‌ఎస్‌) జరుగుతుందని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

మోపిదేవి: స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

హోటల్స్‌, రెస్టారెంట్‌, బేకరీలపై ఆధారపడిన కార్మికులు వేలాది మంది రోడ్డున పడుతున్నారు. చాలా సంస్థలు గ్యాస్‌ కొరత కారణంగా మూత పడుతున్నాయి. కేవలం కార్మికులే కాకుండా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యామ్నాయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

–సోమేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు,

విజయవాడ హోటల్‌ అండ్‌ బేకరీ వర్కర్స్‌ యూనియన్‌

‘గ్యాస్‌’ ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోటల్స్‌ను ప్రభుత్వం ఆదుకోవాలి. 15 రోజులుగా పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హోటల్స్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులును వివరిస్తున్నాం. కమర్షియల్‌ గ్యాస్‌ కోటాను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శనివారం కేంద్రం నుంచి కమర్షియల్‌ కోటాను కొంత మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అది సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా హోటల్స్‌ తాత్కాలికంగా మూసివేశారు. అన్ని వర్గాల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.

రామిశెట్టి వీరస్వామి, అధ్యక్షుడు, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement