గుడ్లవల్లేరు: డోకిపర్రు వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం అన్నదానం జరిగింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు వెంకటకృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల సాయంతో జరిగింది.
ఘనంగా ఊంజల్ సేవ
భూ సమేత శ్రీ వేంకటేశ్వరాలయంలో స్వామివార్ల ఉత్సవమూర్తులకు వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు.


