జననేత కోసం వర్షపు జల్లుల్లోనూ వెల్లువలా తరలివచ్చిన అభిమాన జనం ఈద్ ముబారక్ అంటూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ జై జగన్ అన్న నినాదాలతో హోరెత్తిన ఎస్‌ఎస్ కన్వెన్షన్ ప్రాంగణం
ఎన్టీఆర్ జిల్లా
ఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు 50 వసంతాల వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం పాల్గొన్నారు. వర్క్‌షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్క్ షాపులోని పలు విభాగాలను జీఎం శ్రీవాత్సవ పరిశీలించారు. ముఖ్యంగా మెషీన్ షాప్, ఎంఎండబ్ల్యూ సెక్షన్, పెయింట్ షాప్, సాబ్ సెక్షన్, స్క్రాప్ సెక్షన్, ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్, వీల్‌షాప్ యార్డ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లను సందర్శించారు. సంస్థ నిర్వహణపై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యాగన్ వర్క్‌షాపు ఉద్యోగులు, కార్మికుల కృషితో సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మరింత పురోభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వీల్ మిషన్, పెయింట్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బీపేట(విజయవాడతూర్పు): అభిమాన తరంగం ఉప్పొంగింది. వర్షపు జల్లులతో పోటీపడుతూ జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని చూసేందుకు వెల్లువలా తరలి వచ్చింది. వాన చినుకులను లెక్కచేయక తమ అభిమాన నేత కోసం వేచి చూసింది. జననేత కనిపించిన ఆనం దంతో జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ముస్లింలకు బుధ వారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎస్‌ఎస్ కన్వెన్ష న్‌లో నిర్వహించిన విందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉప్పొంగిన అభిమాన తరంగం
ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు తమ అభిమాన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విజయవాడ చేరుకున్నారు. ఈదురు గాలులు, వర్షపు జల్లు లను లెక్కచేయక వివిధ ప్రాంతాల నుంచి ఇఫ్తార్ విందు జరిగే ఎస్‌ఎస్ కన్వెన్షన్ వద్దకు వేలాదిగా తరలి వచ్చారు. తమ అభిమాన నేత కనిపించగానే జై జగన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇఫ్తార్‌లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులతో పాటు, అభిమానులతో నమాజు చేసే ప్రాంగణం వైఎస్ జగన్ రాకకు ముందే నిండిపోయింది. వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ అభిమాన నేత కోసం తడుస్తూనే అభిమానులు వేచి చూశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. ఇఫ్తార్ విందు ముగిశాక బయటకు వచ్చిన వైఎస్ జగన్‌ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. వైఎస్ జగన్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చిన తర్వాత సైతం అపార్ట్‌మెంట్లపై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుండటాన్ని గుర్తించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి కారు నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంజాద్‌బాషా, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండి తోక అరుణకుమార్, ఇషాక్, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, స్వామిదాసు, ముస్లిం నేతలు, మగ్బూల్, ఖాదర్ బాషా, నదీమ్, అహ్మద్ అలీఖాన్, నియోజకవర్గ ఇన్‌చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, అంజి రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగిన సుప్రభాత సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నాలుగు గంటలకు నిర్వహించిన ఖడ్గ మాలార్చనకు 24 టికెట్లను విక్రయించారు. దీంతో రెండు షిఫ్టుల్లో ఈ సేవను నిర్వహించాల్సి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో జరిగిన చండీహోమంలో 150 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా, మరో 50 మంది పరోక్షంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమంలో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు.
నమాజులో పాల్గొన్న ముస్లింలు (ఇన్‌సెట్) వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


