కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు బుధవారం విఽడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి ఏప్రిల్ ఒకటో తేదీలోగా వెబ్‌సైట్‌లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): పాత ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్‌ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ బుధవారం సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్ నియంత్రణలో ప్రతి తల్లీ ఈగల్ బ్రాండ్ అంబాసిడరేనని, ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ ‘సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వాడకం పై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డాక్టర్ సామ్రాజ్యం, విజయవాడ ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆర్‌ఐ నాగార్జున, ఎస్‌ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలిసి వారు ప్రార్థనలు చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు ముస్లింలు పాల్గొన్నారు.


