పోలీస్‌ గ్రీవెన్స్‌లో 71 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌లో 71 ఫిర్యాదులు

Mar 17 2026 8:14 AM | Updated on Mar 17 2026 8:14 AM

పోలీస్‌ గ్రీవెన్స్‌లో 71 ఫిర్యాదులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌ –గ్రీవెన్స్‌)లో ప్రజల నుంచి 71 ఫిర్యాదులు అందాయి, పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్‌ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడుతూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఆస్తి, భూవివాదాలపై 40, కుటుంబ కలహాలకు సంబంధించి 5, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలపై 5, దొంగతనాలకు సంబంధించి 1, కొట్లాటలపై 1, రోడ్డు ప్రమాదాలపై 1, ఇతర వివిధ సమస్యలపై 15 ఫిర్యాదులు అందాయి. లండన్‌ వర్సిటీలో ప్రసంగించనున్న శ్రీకాంత్‌ పెడన: లండన్‌ యూనివర్సిటీలో ఈ నెల 21, 22వ తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించడానికి తనకు అవకాశం వచ్చిందని నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్‌ కళాశాల ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ కోవూరి శ్రీకాంత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో భారతీయ అంతర్జాతీయ కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీజయంత మహాపాత్ర కవిత్వంపై భౌతిక శాస్త్ర ప్రభావం అనే అంశంపై ప్రసంగించనున్నట్లు శ్రీకాంత్‌ పేర్కొన్నారు. లండన్‌ యూనివర్సిటీలో ప్రసంగించడానికి ఎంపికై న శ్రీకాంత్‌ను కళాశాల కరస్పాండెంట్‌ కె.కుమార్‌బాబు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దోసపాటి బాబా, ప్రిన్సిపాల్‌ రాజాశ్రీని వాస్‌రెడ్డి అభినందించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం ఇబ్రహీంపట్నం: క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని ఏపీఎస్పీఎఫ్‌ ఎన్టీటీపీఎస్‌ యూనిట్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ టి.కృష్ణమాచారి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఎన్టీటీపీఎస్‌ గ్రౌండ్‌లో ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో జోనల్‌ స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. టోర్నమెంట్‌లో ఏపీఎస్పీఎఫ్‌, ఎన్టీటీపీఎస్‌, ఏపీ సెక్రటేరియట్‌, ఏపీ హైకోర్టు, విజయవాడ గార్డ్స్‌, ఎయిర్‌పోర్ట్‌, ఏపీఎస్పీఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌ యూనిట్‌లకు చెందిన ఆరు జట్లు పాల్గొన్నాయి. ఏపీఎస్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ బి.వి.రామిరెడ్డి, కమాండెంట్‌ ఎం.శంకరరావు అసిస్టెంట్‌ కమాండెంట్లు మల్లికార్జునరావు, కె.శ్రీనివాసులు, టి.కామేశ్వరరావు, హేమసుందర్‌, పలువురు ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. వహ్వా.. నిహాన్వి! పామర్రు: మండలం పరిధి రాపర్ల గ్రామంలోని మదర్‌ థెరీసా పాఠశాలలోని నాలుగేళ్ల విద్యా ర్థిని 1 నుంచి 30 వరకు ఎక్కాలు అనర్గళంగా చెబుతోంది. డి.బిక్షాలు, వనజల కుమార్తె నిహాన్వి గత ఏడాది మదర్‌ థెరీసా పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. నిహాన్వి ఒకటి నుంచి ముప్పై వరకు ఎక్కాలను అనర్గళంగా చెబుతూ అందరినీ ఆశ్చర్య చకితులు చేసి స్కూల్‌ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ ఎల్‌. పుష్ప యాకోబ్‌ మాట్లాడుతూ నాలుగేళ్ల చిన్న వయస్సులో ధైర్యంగా 1నుంచి 30 వరకు ఎక్కాలను చూడకుండా చెప్పటం ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం చిన్నారికి మెడల్స్‌, సర్టిఫికెట్‌, బహుమతిని ఇచ్చి ప్రశంసించారు.

ఏపీఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌

కృష్ణమాచారి

ఆల్‌ ఇండియా ఖోఖో టోర్నమెంట్‌కు రాజ్‌కుమార్‌ ఎంపిక

పోలంపల్లి(వత్సవాయి): ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ ఖోఖో టోర్నమెంట్‌కు మండలంలోని పోలంపల్లి జెడ్పీ హైస్కూలు వ్యాయామోపాధ్యాయుడు ధనాల రాజ్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పుణేలో జరగనున్న టోర్నమెంట్‌కు ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో కూడా రాజ్‌కుమార్‌ ఆల్‌ ఇండియా టోర్నమెంట్‌లో సిల్వర్‌ మెడల్‌ను సాధించారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాల హెచ్‌ఎం కొక్కిరగడ్డ జ్యోతి, రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షుడు మడక ప్రసాద్‌, జిల్లా ఖోఖో సంఘ కార్యదర్శి మద్దినేని సత్యప్రసాద్‌, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

1 నుంచి 30ఎక్కాలు అనర్గళంగా

చెబుతున్న నాలుగేళ్ల చిన్నారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement