చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు | - | Sakshi
Sakshi News home page

చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు

Mar 17 2026 7:52 AM | Updated on Mar 17 2026 7:52 AM

చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవానికి, భాషా–సాంస్కృతిక స్వాభిమానానికి నిలువెత్తు ప్రతీక అని కలెక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగ నిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అజ రామరం అన్నారు. అమరావతిలోని శాఖమూరులో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరయ్యారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement