గడువులోగా సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి

Mar 17 2026 7:51 AM | Updated on Mar 17 2026 7:51 AM

● ఇబ్రహీంపట్నంలో 170 వడ్డెర కుటుంబాలు ఒక సొసైటీగా ఏర్పడి 5 హెక్టార్లలో మైనింగ్‌ చేయడానికి అవసరమైన అనుమతులు పొందాయి. స్థానిక టీడీపీ నాయకత్వం మైనింగ్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో మైనింగ్‌కు అడ్డంకులు తొలగించాలని ఇబ్రహీంపట్నంకు చెందిన వడ్డెర కులస్తులు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. ● ఆశా వర్కర్లకు గౌరవం వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, వంటి సౌకర్యాలు ఏమీ లేవు. కానీ ప్రభుత్వ ఉద్యోగులంటూ ప్రభుత్వం వితంతు పెన్షన్లు నిలిపివేసింది. నిలిపివేసిన వితంతు పెన్షన్లను పునరుద్ధరించాలంటూ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించారు.

జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ లక్ష్మీశ ప్రజల నుంచి 88 అర్జీలు స్వీకరణ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రాధాన్యతతో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయంతో అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 88 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్‌ చెప్పారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement