పది పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయండి
జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గవర్నర్‌పేటలోని సీవీఆర్ మున్సిపల్ హైస్కూల్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. వారిని ఆయా సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగారు. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమయంలో ఉపాధ్యాయులు సెలవులు వినియోగించవద్దన్నారు. ఉపాధ్యాయులు ఆత్మపరిశీలన, నిబద్ధతతో విద్యార్థులపై దృష్టిపెట్టి పరీక్షలకు సన్నద్ధం చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి అర్ధమయ్యే రీతిలో బోధించి పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులతో పాటు మిగిలిన తరగతుల విద్యార్థులపై కూడా అంతే శ్రద్ధ కనపరచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థంగా నిర్వహించాలని, పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉన్నారు.
సక్రమంగా అమలు కాని మహిళా చట్టాలు
పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి.సత్యవతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దశాబ్దాలుగా పోరాటాలు సాగించి మహిళలు సాఽధించుకున్న చట్టా లు ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదని ప్రముఖ సీ్త్రవాద రచయిత్రి పి.సత్యవతి అన్నారు. చట్టాన్ని అమలు చేసే సమాజ వ్యవస్థే పితృస్వామ్యంతో, కుల వివక్షతో, వర్గ పక్షపాతంతో నిండిపోవడమే ఇందుకు కారణమన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో బుధవారం మహిళా చట్టాల అనుభవాలు – న్యాయం కోసం సుదీర్ఘ ప్రయాణం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. సత్యవతి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఉద్యమాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చట్టాలు, వాటి అమలు మళ్లీ మహిళలను అణిచే సంస్థల చేతుల్లోకి వెళ్లాయన్నారు. కోర్టులు ‘చరిత్ర,’ ‘సమ్మతి,’ ‘కుటుంబ గౌరవం’ వంటి పాత కాలపు ఆలోచనలపై ఆధారపడి తీర్పులిస్తున్నాయన్నారు. అనేక కేసుల్లో సాక్ష్యాధారాలు నాశనం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.పద్మ, రాష్ట్ర నాయకులు పి.పద్మ, ఎన్.విష్ణు, జి.మణి, ఎట్టి భారతి, ఎస్.జయలక్ష్మి, కె.లత, కె.దుర్గ, బి.శ్రీదేవి, బి. మంజుల, వసంతమ్మ పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొని యువకుడు దుర్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు క్రీస్తురాజపురంలోని అరుళ్‌నగర్‌కు చెందిన మందా మరియదాస్ లయోలా కాలేజీ హాస్టల్‌లో వంట మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని కుమారుడు మందా కార్తీక్(22) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. మంగళవారం సాయంత్రం కార్తీక్ స్కూటీపై మంగళగిరిలో ఉంటున్న తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు. తిరిగి రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తూ స్క్యూబ్రిడ్జి దాటగానే ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి హైవే డివై డర్‌ను ఢీకొట్టింది. దీంతో కార్తీక్ డివైడర్‌కు గుద్దుకుని కిందపడిపోయి తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతనిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పది పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయండి
పది పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయండి


