ఉత్కంఠభరితంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల, కృష్ణాజిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు మూడవ రోజు బుధవారం కూడా ఉత్కంఠభరితంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్ జట్టు 37–33 పాయింట్లతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. చండీఘర్, సీబీఎస్‌ఈ జట్ల మధ్య పోటీలో చండీఘర్ 46–9 పాయింట్లతో ఘన విజయం సాధించింది.
తమిళనాడు, కేవీఎస్ జట్ల మధ్య పోటీలో తమిళనాడు జట్టు 34–26 పాయింట్లతో గెలుపొందింది. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీలో పశ్చిమబెంగాల్ జట్టు 42–41 పాయింట్లతో విజయం సాధించింది. రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య పోటీలో రాజస్థాన్ జట్టు 55–32 పాయింట్లతో ఘనవిజయం సాధించింది. ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్ జట్ల మధ్య పోటీలో ఉత్తరప్రదేశ్ జట్టు 66–12 పాయింట్లతో ఘన విజయం సాధించింది. ఒడిశా, సీబీఎస్‌ఈ జట్ల మధ్య పోటీలో ఒడిశా జట్టు 56– 51 పాయింట్లతో గెలుపొందింది. చత్తీశ్‌గఢ్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య పోటీలో చత్తీశ్‌గఢ్ జట్టు 42– 22 పాయింట్లతో గెలుపొందింది. తెలంగాణ, కేరళ జట్ల మధ్య పోటీలో తెలంగాణ జట్టు 49– 32 పాయింట్లతో విజయం సాధించింది. బీహార్, తమిళనాడు జట్ల మధ్య పోటీలో బీహార్ జట్టు 32– 22 పాయింట్లతో గెలుపొందింది. జార్ఖండ్, కేవీఎస్ జట్ల మధ్య పోటీలో జార్ఖండ్ జట్టు 41–18 పాయింట్లతో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్, ఎన్‌వీఎస్ జట్ల మధ్య పోటీలో హిమాచల్‌ప్రదేశ్ జట్టు 39–15 పాయింట్లతో గెలుపొందింది.


