యంత్రాంగం కదలకపోతే పోరాటం చేస్తాం..
వాయుగుండాలు, తుఫాన్ల నేపథ్యంలో తక్షణమే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నూర్చిన వెంటనే సంచులిచ్చి ధాన్యాన్ని మిల్లుకు తోలి రైతు నష్టపోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. రేపటి నుంచి అధికార యంత్రాంగం కదలకపోతే వైఎస్సార్‌సీపీ తరపున జిల్లా, మండల కేంద్రాల్లో పోరాటం చేస్తామని పేర్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం మచిలీపట్నం అధ్యక్షుడు జి రాజు, ఆ పార్టీ అవనిగడ్డ, మోపిదేవి మండల కన్వీనర్లు రేపల్లె శ్రీనివాసరావు, గరికపాటి వెంకటేశ్వరరావు (బుల్లిబాబు), పలువురు నాయకులు పాల్గొన్నారు.


