హిందీ నాటక పోటీల్లో విజయవాడ డివిజన్ సత్తా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సికింద్రాబాద్‌లో ఈ నెల 17న జరిగిన జోనల్ స్థాయి హిందీ నాటక పోటీల్లో విజయవాడ డివిజన్ మొదటి స్థానం కై వసం చేసుకుంది. విజయవాడ బృందం ప్రదర్శించిన ‘అఖండ పర్వ్’ నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. విజయవాడలోని మెయిల్ ట్రైన్ మేనేజర్ ఎం. గోపాల్ కృష్ణ దర్శకత్వంలో పలు విభాగాల సిబ్బంది అత్యుత్తమ ప్రదర్శనతో వారి పాత్రలకు జీవం పోశారు. ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ లైటింగ్, ఉత్తమ సౌండ్ ఎఫెక్ట్స్, ఉత్తమ కాస్ట్యూమ్స్, ఉత్తమ మేకప్, ఉత్తమ సంగీతం, ఉత్తమ స్టేజ్ డెకరేషన్, ఉత్తమ సహనటుడు, ఉత్తమ నటి ఇలా తొమ్మిది వ్యక్తిగత అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఈ నెల 18న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ చేతుల మీదుగా విజయవాడ డివిజన్ బృందం అవార్డులను అందుకుంది. గురువారం నాటక బృంద సభ్యులు డీఆర్‌ఎం మోహిత్ సోనాకియాను మర్యాద పూర్వకంగా కలుసుకుని సాధించిన అవార్డులను చూపించారు. బృంద సభ్యులను డీఆర్‌ఎం ప్రత్యేంగా అభినందించారు. ఏడీఆర్‌ఎం పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, పలు బ్రాంచ్‌ల అధికారులు, సీనియర్ రాజభాష అధికారి హేమంత్ వాడేకర్ తదితరులు పాల్గొన్నారు.
బృందాన్ని అభినందించిన
డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా


