చంద్రమౌళీశ్వరుని సేవలో కలెక్టర్ లక్ష్మీశ దంపతులు
విజయవాడ కల్చరల్: కంచి కామకోటి పీఠస్థ లబ్బీపేటలోని శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం కార్తిక మాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశ దంపతులు పాల్గొన్నారు. దేవాలయంలో నిర్వహించిన మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చనలో పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేవాలయ వేదపండితులు లక్ష్మీశ దంపతులకు వేదపండితులు వేదాశీర్వాదం, మహాప్రసాదం అందించారు. దేవాలయ కార్యనిర్వాహకుడు డాక్టర్ రామ్మోహనరావు దేవాలయంలో జరిగే సేవలను వివరించారు. మేనేజర్ శర్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు, 6.30 గంటలకు, 8 గంటలకు, 10.30 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఉదయం 11 గంటలకు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి శాంతి కల్యాణం చేశారు.స్వామివారిని ఆలయ ప్రాంగణంలో పల్లకీలో ఊరేగించారు. కొండపైకి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని దీపారాధన చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రాత్రి పంచహారతులు, పల్లకీసేవ జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
పెనమలూరు: కృష్ణా జిల్లా వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేసినట్టు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుర్రాల రవి తెలిపారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 14,15,16 తేదీలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల నేపథ్యంలో పోరంకిలో ఎంపికలను నిర్వహించినట్టు చెప్పారు. 48 కేజీల విభాగంలో ఎన్‌వీవీ నాగఅను, 63 కేజీలలో ఒ.గాయత్రి, 77 కేజీల విభాగంలో బి.ఝాన్సీ, 101 కేజీల విభాగంలో బీఎస్‌డీ విష్ణువర్థన్‌లను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అధ్యక్షుడు కె.దామోదర్, జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పీబీబీ లింగేశ్వరరావు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్, ఎస్.తినాథ్, జి.వినోద్ పాల్గొన్నారు.
కోడూరు: కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర కృష్ణా సాగరసంగమం వద్ద పుణ్యస్నానాలకు అనుమతి లేదని అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. కార్తికమాసాన్ని పురస్కరించుకుని హంసలదీవి బీచ్‌కు పర్యాటకుల తాకిడి పెరగడంతో కోడూరు పోలీసు, పాలకాయతిప్ప మైరెన్ పోలీసులతో కలిసి తీరంలో పర్యటించారు. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో తీరంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్‌లో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్‌తో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. పుణ్యస్నానాలు, పూజా కార్య క్రమాలు నిర్వ హించే సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, నడుమ లోతు దాటి సముద్రంలో వెళ్లకూడదని స్పష్టం చేశారు. పిల్లలు, వృద్ధులతో పాటు ఫిట్స్ ఉన్న వ్యక్తుల విషయంలో కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలలు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది, గజ ఈతగాళ్ల సూచనలు కచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం బీచ్ పరిసరాలతో పాటు సారగ సంగమ ప్రాంతాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి, ఎస్‌ఐలు చాణిక్య, పూర్ణమాధురి పాల్గొన్నారు.
చంద్రమౌళీశ్వరుని సేవలో కలెక్టర్ లక్ష్మీశ దంపతులు
చంద్రమౌళీశ్వరుని సేవలో కలెక్టర్ లక్ష్మీశ దంపతులు


