కృష్ణా జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారిపొడవునా ఆయనకు రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు.
04-11-2025
4: 30 PM
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..
ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది
విపత్తులు వచ్చినా రైతులను పట్టించుకోని పరిస్థితి
మోంథా తపానుతో అత్యధికంగా వరిపంట నష్టం జరిగింది
గింజలు పాలు పోసుకునే సమయంలో దెబ్బతింది
4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న , అరటి, బొప్పాయి దెబ్బతిన్నాయి
కూటమి పాలనలో రైతులకు ఇన్సూరెన్స్ లేదు
18 నెలల కూటమి పాలనలో 16 విపత్తుల వచ్చాయి
అన్నదాత సుఖీభవ పేరతో రైతులను మోసం చేశారు
రూ. 40 వేలు ఇవ్వాల్సింది కేవలం రూ. 5 వేలు మాత్రమే ఇచ్చారు
మా హయాంలో రైతులకు భరోసా ఉండేది
జగనన్న ఉన్నాడనే భరోసా రైతులకు ఉండేది
ప్రతీ రైతును ఆర్బీకేలు చేయిపట్టుకొని నడిపించాయి
ప్రతీ ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉండేవాడు
మా హయాంలో ఈ-క్రాప్ నమోదు చేసేవాళ్లం
ఈ క్రాప్‌తో ప్రతిరైతుకు న్యాయం జరిగేది
పంట కొనుగోలుకు కాంపిటేషన్ క్రియేట్ చేశాం
రూ. 7,800 కోట్లతో పంటలకు గిట్టబాటు ధర ఉండేలా చేశాం
రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం
85 లక్షల మంది రైతులకు మేం ప్రీమియం చెల్లించాం
ఇప్పుడు 19 లక్షల మంది రైతులకు మాత్రమే బీమా ఉంది
ఉచిత పంటల బీమా తీసేయడం దారుణం కాదా
ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ కోసం అధికారులు రాలేదు
ఒక్క రోజులోనే ఎన్యమురేషన్, ఆడిట్ అయిపోయింది
కృష్ణా జిల్లా :
- మోంథా తుఫానుకు కారణంగా నేలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్
- పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలన
- బాధిత రైతులకు వైఎస్ జగన్ ఓదార్పు
- తుపాను దెబ్బకు తడిసిన కంకులను వైఎస్ జగన్‌కు చూపించిన రైతులు
- పంట నష్టం అంచనా వేయలేదంటూ రైతుల ఆవేదన
- 18నెలల కాలంలో ఇన్‌పుట్ సబ్సీడీ రాలేదన్న రైతులు




- రామరాజుపాలెం చేరుకున్న వైఎస్ జగన్
- పంటపొలాలను పరిశీలించనున్న వైఎస్ జగన్
- పంటపొలాలను సందర్శించే చోట పోలీసుల పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు
- జనం వెనక్కి వెళ్లిపోవాలంటూ హుకుం
- జగన్‌తో పాటు వస్తున్న వాహనాలను నిలిపేసిన పోలీసులు
- చెక్ పోస్టు పెట్టి బైకులు, కార్లు నిలిపివేత
- రైతులను కూడా తరిమేస్తున్న పోలీసులు

మూడున్నర గంటలు ఆలస్యంగా జగన్ పర్యటన
కృష్ణా జిల్లా గూడూరు చేరుకున్న వైఎస్ జగన్
గూడూరుకు ఉదయం 11:30 గంటలకు రావాల్సి ఉన్నా మూడున్నర గంటలు ఆలస్యం
విజయవాడ నుండే రోడ్డు పొడవునా జగన్ స్వాగతం పలుకుతున్న రైతులు, మహిళలు, కార్యకర్తలు
దారి మధ్యలో ప్రతిచోటా జగన్‌కు ఘన స్వాగతం
దారి పొడవునా జగన్‌కు తమ కష్టాలు చెప్తున్న రైతులు
తుపాను దెబ్బకు తడిచిన వరి కంకులు, కుళ్లిపోయిన పసుపు, అరటి పిలకలను జగన్‌కు చూపిస్తూ భోరుమన్న రైతులు
బాధిత రైతులను ఓదార్చిన జగన్
గూడూరు చేరుకున్న వైఎస్ జగన్
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్
గూడురు చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన మహిళలు,రైతులు
దారి పొడవునా వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం
రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన మహిళలు, రైతులు
తరకటూరు చేరుకున్న వైఎస్ జగన్
- పెడన నియోజకవర్గంలోకి ఎంటరైన వైఎస్ జగన్
- తరకటూరు చేరుకున్న జగన్
నిడమోలులో వైఎస్ జగన్
- నిడుమోలు చేరుకున్న వైఎస్ జగన్
- రోడ్డుకు ఇరువైపులా భారీగా నిల్చున్న రైతులు
- ఎండ తీవ్రతలోనూ జగన్ కోసం వేచి ఉన్న రైతులు
కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం
- వైఎస్ జగన్ కోసం దారి పొడవునా ఎదురు చూస్తున్న అభిమానులు
- ఈడుపుగల్లులో వైఎస్ జగన్‌ను కలిసిన మహిళా రైతులు
- నష్టపోయినవ అరటి, వరి పంటను వైఎస్ జగన్ చూపించిన రైతులు
- వరి కంకులను పరిశీలించిన వైఎస్ జగన్
మచిలీపట్నంలో పోలీసుల ఆంక్షలు
- మచిలీపట్నం, సుల్తాన్‌నగర్, ఎస్‌ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టిన పోలీసులు
- బారికేడ్లు పెట్టడంతో పొలాల మధ్య నుంచి వస్తున్న రైతులు
పామర్రు: 14వ మైలురాయి వద్దకు చేరుకున్న వైఎస్ జగన్
- వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన రైతులు, మహిళలు
- దారిపొడవునా వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
పామర్రు నియోజకవర్గంలో ప్రవేశించిన వైఎస్ జగన్
గోపువానిపాలెం చేరుకున్న వైఎస్ జగన్
గజమాలలతో జగన్‌కు స్వాగతం పలికిన కార్యకర్తలు
భారీగా తరలివచ్చిన మహిళలు, వృద్ధులు
దారి పొడవునా వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
మచిలీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్
- రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
- పోలీసుల తీరుపై పేర్ని కిట్టు ఆగ్రహం
గండిగుంట చేరుకున్న వైఎస్ జగన్
పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికిన మహిళలు
ఆకునూరు సెంటర్ కి చేరుకున్న వైఎస్ జగన్
జగన్‌ని కలిసి తమ కష్టాలు చెప్పుకున్న కల్లుగీత కార్మికులు

నెప్పల్లి సెంటర్‌లో పోలీసుల ఆటంకాలు
జగన్‌తో వస్తున్న వాహనాలను నిలిపేస్తున్న పోలీసులు
చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాల దారి మళ్లింపు
జగన్ కాన్వాయ్ తప్ప మిగతా వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు
నెప్పల్లి సెంటర్‌కు చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన రైతులు, మహిళలు
దారిపొడవునా వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం

గోసాల సెంటర్‌లో జగన్‌ని కలిసిన మహిళా రైతులు
- తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులు
- తమకు జరిగిన నష్టంపై జగన్‌కు వినతి పత్రాలు సమర్పించిన అన్నదాతలు
ఈడుపుగల్లులో జగన్‌ని కలిసిన మహిళా రైతులు
తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటను జగన్ జగన్ కు చూపించిన రైతులు

కంకిపాడు మండలం, నెప్పల్లి సెంటర్‌లో పోలీసుల ఆంక్షలు
- వాహనాలు మచిలీపట్నం వైపు వెళ్లకుండా బారికేడ్లు
- డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులు
- తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు
- బైక్‌ల తాళాలు లాక్కొని జగన్‌ను చూసేందుకు వెళ్లకుండా ఆంక్షలు
వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరు: పేర్ని నాని
- ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరు
- రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నారు?

పెనమలూరు సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్
భారీ బైకు ర్యాలీతో స్వాగతం పలికిన యూత్
తాడిగడపలో పోలీసుల అత్యుత్సాహం
- బైక్‌లపై వస్తున్న యువతను అడ్డుకుంటున్న పోలీసులు
- వైఎస్ జగన్‌తో పాటు వెళ్లకుండా అడ్డంకులు
జగన్‌ను రైతులు కలవకుండా భారీగా పోలీసుల మోహరింపు
- రోప్ పార్టీలతో అడ్డుకుంటున్న పోలీసులు
- పామర్రు: బల్లిపర్రుకు భారీగా చేరుకుంటున్న రైతులు
- రైతులను, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అడ్డుకుంటునన్న పోలీసులు
- కైలే అనిల్‌కుమార్‌తో పమిడిముక్కల సీఐ వాగ్వాదం
- రోడ్డు మీద ఉండొద్దంటూ పోలీసుల ఆంక్షలు
విజయవాడ పడమట చేరుకున్న వైఎస్ జగన్
- గుమ్మడి కాయలతో దిష్టి తీస్తున్న మహిళలు
- భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు
- పూలు చల్లుతూ ఘన స్వాగతం

కృష్ణా జిల్లా పర్యటనకు బయల్దేరిన వైఎస్ జగన్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలు పరిశీలన
బాధిత రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్‌ను కలవకుండా రైతులపై ఆంక్షలు
జనాన్ని రాకుండా అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు మోహరింపు
వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను బ్లాక్ చేసిన పోలీసులు
నేడు కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్
తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్న వైఎస్ జగన్
రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ షరతులు
కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ ఆంక్షలు
ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు
వైఎస్ జగన్ పర్యటనకు రావొద్దంటూ వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు
మాజీ ఎమ్మెల్యే లు, మండల, గ్రామ నాయకులకు నోటీసులతో బెదిరింపులు



