సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేశారు.
మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు.


