
వైభవంగా దసరా వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్థానిక సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో బుధవారం అమ్మవారి శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, సూర్యనమస్కారాలు, చండీహోమం, సుహాసిని పూజ, దంపతుల పూజ జరిగాయి. మధ్యాహ్నం ఆరు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం గాయత్రీనగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లో అమ్మ వారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారు గురువారం శ్రీ విజయరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తామని నిర్వాహకుడు వైట్ల కృష్ణప్రసన్న తెలిపారు.