
విజయవాడ సిటీ
దుర్గగుడిపై నేడు
న్యూస్‌రీల్
విజయ దశమి రోజు అన్ని వీఐపీ దర్శనాలు రద్దు
దసరా ఉత్సవాల్లో 11 రోజైన విజయ దశమి రోజున అన్ని వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే వీఐపీ దర్శనాలు నిలిపివేయడంతో పాటు కొండపైకి వీఐపీ వాహనాలను సైతం అనుమతించేది లేదని స్పష్టంచేశారు. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లలో సైతం భక్తులు ఉచిత దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.
7 లక్షల క్యూసెక్కుల వరద
వర్షంలో ఇక్కట్లు
పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఉధృతం
బుధవారం తెల్లవారుజామున నాలుగు
గంటల నుంచి అమ్మవారి దర్శనం
ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక
ఖడ్గమాలార్చన
ఉదయం 7 గంటలకు ప్రత్యేక
కుంకుమార్చన
ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం, ప్రత్యేక శ్రీచక్రనవార్చన
సాయంత్రం 5 గంటలకు ఆదిదంపతుల
నగరోత్సవం
సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా
నివేదన, పంచహారతుల సేవ, వేద స్వస్తి
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
u10లో
● వైభవంగా దేవీశరన్నవరాత్రి
మహోత్సవాలు
● వేదపఠనంతో మార్మోగిన ఇంద్రకీలాద్రి
● అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీలు
● నేడు మహిషాసురమర్దినిగా
దర్శనమివ్వనున్న దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షకుడిని వధించి ఇంద్ర కీలాద్రిపై దుర్గాదేవిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్‌లోకి చేరిన భక్తులకు తెల్లవారుజామునే దర్శనం పూర్తయింది. మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో క్యూలైన్‌లో ఉన్న భక్తులు, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీలు, సిఫార్సులతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీఐపీల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కనకదుర్గమ్మ బుధవారం శ్రీమహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తారు.
ముగింపు దశకు ఉత్సవాలు
గత నెల 22వ తేదీన ప్రారంభమైన దసరా ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం శ్రీరాజరాజేశ్వరి అలంకారం, ఉదయం పది గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దీక్ష స్వీకరించిన భవానీల రాక ప్రారంభమైంది. దీంతో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీమాలధారుల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి.
దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్ సాద రంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటి హేమ అమ్మవారిని దర్శించుకున్నారు.
9
కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణానదికి మంగళవారం ఏడు లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు.
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు వర్షంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇంద్రకీలాద్రి పరిస రాల్లో మంగళవారం గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది.
పీహెచ్‌సీ వైద్యులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. మంగళవారం జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్య సేవలను బహిష్కరించారు.

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ