
టీటీలో నగర క్రీడాకారులకు పతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలోని వైవీ రావు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సెప్టెంబర్ 29న జరిగిన యూటీటీ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దామూస్ టీటీ అకాడమీ క్రీడాకారులు పలు పతకాలు సాధించినట్లు అకాడమీ కోచ్ వై.దామోదర్ రెడ్డి తెలిపారు. బాలుర అండర్ 15 విభాగంలో జి.లోహిత్ స్వర్ణ పతకం, బాలికల అండర్ 11 విభాగంలో జి.మహి మన్విక స్వర్ణ పతకం, జి.మిషిక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరందరూ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను కృష్ణాజిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ.రామిరెడ్డి, వి.భార్గవి, కోశాధికారి ఎ.రామచంద్రరావు, వీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఎ.శ్రీధర్, శిక్షకులు స్వపన్ గంగోపాధ్యాయ అభినందనలు తెలిపారు.
రెండు స్వర్ణ, ఒక కాంస్యం కై వసం