
9వ రోజు ఆదాయం రూ.40.12 లక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పిచ్చుక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తురకపాలెంలో మరణించిన వారంతా గ్రామంలో కంకర క్వారీల్లో పనిచేసేవారని తెలిపారు. అక్కడి ప్రజలు తాగే నీటిని చైన్నె ల్యాబ్‌కు పంపించగా నీటి కాలుష్యాన్ని ధ్రువీకరించిందన్నారు. ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల వితంతు మహిళలకు ఉద్యోగ భరోసా కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సభ్యులు అన్సారీ, వెంకట్, సతీష్, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు కె.ఎం.సుభాన్, లక్ష్మణరావు, బాషా, సలాం తదితరులు పాల్గొన్నారు.
గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించగా మొదటి స్థానం చిత్తూరు జిల్లా జట్టు దక్కించుకుందని న్యూ గుడివాడ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నమనేని పూర్ణ వీరయ్య(బాబ్జి) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రా పురం జట్టు రెండో స్థానం, ఎస్‌ఆర్‌ఎంఏపీ అమరావతి జట్టు మూడో స్థానంలో నిలిచా యని వివరించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, జీవితకాల సభ్యులు, కోచ్‌లు పాల్గొన్నారు.
గన్నవరం రూరల్: ఓ వ్యక్తి అవయవదానంతో నలుగురికి పునర్జన్మ లభించింది. గన్నవరం మండలం చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని మెడికల్ కళా శాల బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మొవ్వ ప్రదీప్‌కుమార్(46) గత నెల 25వ తేదీన వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న అతనికి 29వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అవయవ దానం చేసేందుకు ప్రదీప్‌కుమార్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. హాస్పిటల్‌లోని జీవన్‌ధాన్ ప్రక్రియ ద్వారా లివర్, కిడ్నీలు రెండు, లంగ్స్‌ను రాష్ట్రంతో పాటు తెలంగాణ పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రదీప్ కుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

9వ రోజు ఆదాయం రూ.40.12 లక్షలు