
వరదొచ్చినా...ముంపు భయం లేదు
సంతోషంగా పండుగ చేసుకుంటున్నాం రిటైనింగ్ వాల్ మాకు సదా రక్ష వైఎస్ జగన్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం రాణీగారితోట, కృష్ణలంక ప్రజల కృతజ్ఞతాభివందనాలు
కృష్ణలంక/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణా నదికి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కృష్ణలంక కరకట్ట ప్రాంత వాసులకు వరద భయం లేదు. తట్టా బుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మూడు రోజులుగా ఏడు లక్షల పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా... దసరా పండుగను సంతోషంగా తమ ఇళ్లలోనే జరుపుకొంటున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆనందంతో చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే సుమారు 70 వేల మంది ప్రజల ముంపు సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిష్కరించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలా...
ప్రస్తుతం కృష్ణానదికి 7 లక్షల క్యూసెక్యులకు పైగా వరద వస్తోంది. ఒకప్పుడు ఇంత వరద వచ్చిందంటే కృష్ణలంక ప్రాంతంలోని రణదీవె నగర్, తారకరామా నగర్, భూపేష్‌గుప్తా నగర్, రామలింగేశ్వర నగర్ పోలీస్‌కాలనీలు నీట మునిగేవి. ఆ ప్రాంత ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాల్సి వచ్చేది. వరద ఎప్పుడు తగ్గుతుందా అంటూ ఎదురుచూసే వారు. కూలిపనులకు కూడా వెళ్లే అవకాశం ఉండేది కాదు. పిల్లలు స్కూలుకు వెళ్లేవారు కాదు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక వ్యాధుల బారిన పడేవాళ్లు. ఆ రోజులను గుర్తు చేసుకుంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.
రిటైనింగ్ వాల్‌తో వరద సమస్యకు చెక్
కృష్ణలంక వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కనకదుర్గమ్మ వారధికి ఎగువన ఒక కిలోమీటరుతో పాటు, దిగువన భూపేష్‌గుప్తా నగర్ వరకూ వాల్ నిర్మించారు. కృష్ణానదికి గత ఏడాది 11 లక్షల క్యూసెక్యులకు పైగా నీరు వచ్చినా వరద ముప్పులేకుండా రిటైనింగ్ వాల్ కాపాడగలిగింది.
సంతోషంగా పండుగ
చేసుకుంటున్నాం
ఇళ్లు మునుగుతాయనే భయం లేదు
నాడు పండుగలు ఉండేవి కాదు