
అప్పుల బాధతో బలవన్మరణం
తాడేపల్లిరూరల్: పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ పండ్ల వ్యాపారి మద్యానికి బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తాడేపల్లి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన వెంకన్న (45) జీవనోపాధి కోసం విజయవాడ వచ్చి సాంబమూర్తిరోడ్‌లోని బావాజీపేట 1వ లైన్‌లో నివసిస్తున్నాడు. అతను పండ్ల వ్యాపారి. వెంకన్న మద్యానికి బానిసై అందినచోటల్లా అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో అప్పులు తీర్చలేక తాడేపల్లి రూర ల్ కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసుల సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో తాడుతో ఉరి వేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.