
కృష్ణా జేసీ గీతాంజలిశర్మ బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గీతాంజలిశర్మను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. ఆమె స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. గీతాంజలిశర్మ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ముంబై ఐఐటీలో డేటా ఎనలటిక్స్‌పై శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్ బాధ్యతలను డీఆర్వో చంద్రశేఖరరావు నిర్వర్తిస్తున్నారు. జాయింట్ కలెక్టర్‌గా గీతాంజలిశర్మ 2024 జనవరి 5వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 20 నెలల పాటు జిల్లాలో పనిచేశారు. ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు.