గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు | - | Sakshi
Sakshi News home page

గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు

Mar 24 2025 2:34 AM | Updated on Mar 24 2025 2:35 AM

కోడూరు: భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కోడూరు గంగాభవానీ అమ్మవారి మూలమూర్తిని ఆదివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.47గంటల సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి శిలపై పడ్డాయి. అమ్మవారి శిలకు ఇత్తడి తొడుగు కూడా ఉండడంతో ఆ కిరణాల వెలుగుల మధ్య అమ్మవారు ప్రకాశించారు. గతంలో ఎన్నడూ ఇలా నేరుగా అమ్మవారిపై సూర్యకిరణాలు పడలేదని, తొలిసారి అమ్మవారి శిలను సూర్యకిరణాలు తాకాయని ఆలయ ప్రధానార్చకుడు కోమ్మూరి శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

దరఖాస్తు గడువు పెంపు

చిలకలపూడి(మచిలీపట్నం): బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వివిధ కులాల వారికి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 25వ తేదీ మంగళవారం వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్‌ ఈడీ కె.శంకరరావు ఆదివారం తెలిపారు. ఈ–బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్‌కు సంబంధించిన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూ రు చేసేందుకు దరఖాస్తుదారులు ఏపీవోబీఎంఎంఎస్‌ ద్వారా పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ గడువు 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. కాపు కార్పొరేషన్‌కు సంబంధించి వయో పరిమితిని 21 నుంచి 60 ఏళ్లుగా నిర్ణయించారన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

‘సబ్కా కృష్ణా’

నూతన కార్యవర్గం ఎన్నిక

పటమట(విజయవాడ తూర్పు): ేస్టట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ(సబ్కా కృష్ణా) 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆదివారం లబ్బీపేటలోని అసోసియేషన్‌ కార్యాలయంలో కృష్ణా జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడిగా కలిదిండి కృష్ణం రాజు, కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా మండ వ సాయి, కార్యదర్శిగా లింగం రవికిరణ్‌, ఉపాధ్యక్షుడిగా కోటిరెడ్డి, మురళీధర్‌ ఎన్నికయ్యారు. ట్రెజరర్‌గా వెంకటేశ్వర రాజు, జాయింట్‌ సెక్రటరీలుగా రవికుమార్‌, సురేష్‌ కుమార్‌, భూపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పూర్ణ, శ్రీధర్‌, వీరబ్రహ్మం, శ్రీనివాసరెడ్డి, శేషగిరి రావు, శ్రీనివాసరావు, హరికృష్ణలు ఎన్నికవ్వగా అడ్వైజర్లుగా సకలారెడ్డి, రత్నారావు, అమర్‌ బాబు, సుధీర్‌ ఎన్నికయ్యారు.

గ్రంథాలయ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గుమ్మా

పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం, కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు, కార్యదర్శిగా కె.బి.ఎన్‌.కళాశాల గ్రంథపాలకుడు వై. శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు. జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న సర్వోత్తమ భవనంలో జిల్లా శాఖ అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు అధ్యక్షతన జరిగింది. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రావి శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బల్రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల లైబ్రేరియన్‌ టి. సాంబశివరావు ఉపాధ్యక్షుడిగా, కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి పి.అజయ్‌ కుమార్‌ సహాయ కార్యదర్శిగా, మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రంథాలయరంగ పరిస్థితులపై సభ్యులు చర్చించి, పలు అంశాలపై తీర్మానించారు.

గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు 1
1/1

గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement