రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ 45 ప్లస్ డబుల్స్ కేటగిరీలో విజయవాడ, గుంటూరు డివిజన్‌ల ఉద్యోగులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 20న జరిగిన ఫైనల్స్‌లో విజయవాడ డివిజన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్‌లో టెక్నీషియన్ సంపత్‌కుమార్, గుంటూరులోని అమరావతి బెంచ్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్ చాంపియన్స్‌గా నిలిచారు. హారాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఖమ్మంకు చెందిన వెంకటేశ్వరరావు, పాల్వంచ నుంచి భాస్కరరావులతో వారు పోటీపడి విజేతలుగా గెలిచారు.