
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదకొండవ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన తరువాత పద్దులను ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల ఆమోదించారు.
ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ , గర్రెపల్లి శ్రీనివాస్, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకట రమణ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్‌గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.
2024‐2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పద్దుల తనిఖీ దారులుగా సేవలు అందించిన కైలాసపు కిరణ్, తెల్లదేవరపల్లి కిషన్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ రాజ్యాంగానికి ప్రతిపాదించిన కొన్ని ముఖ్యమైన సవరణలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు.
2025 నుంచి 2026 గాను పద్దుల తనిఖీ దారులుగా నీలం సుఖేందర్, కిరణ్ కుమార్ ఎర్రబోయిన గార్లను ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు సాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీ ని ఆస్వాదించారు.
ఈ సమావేశంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ గార్ల తోపాటు ఇతర జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)