మిస్‌ తెలుగు యూఎస్‌ఏ పోటీల విజేత అమూల్య | Miss Telugu USA 2026 Winner Amulya | Sakshi
Sakshi News home page

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ పోటీల విజేత అమూల్య

Apr 10 2026 9:59 AM | Updated on Apr 10 2026 9:59 AM

Miss Telugu USA 2026 Winner Amulya

అమెరికాలో జరిగిన మిస్‌ తెలుగు యూఎస్‌ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని డల్లాస్‌ చార్లెస్‌ డబ్ల్యూఎస్సీమాన్‌ సెంటర్‌లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. 

ప్రముఖ నటి లయ చేతుల మీదుగా అమూల్య టైటిల్‌ అందుకున్నారు. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, రమలు తెలిపారు.   

ఇక మహిమ  రన్నరప్‌ టైటిల్‌ను గెలుచుకున్నారు. గతంలో మిస్‌ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్‌ ఇంటర్నేషనల్‌ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement