
ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో పాటు పలు ఆల్బమ్ లో నటించి.. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మెప్పిస్తోంది అందాల బ్యూటీ అంకితా జాదవ్. 2024 లో రిలీజ్ అయినా ఇంద్రాణి మూవీలో నటుడు అజయ్ సరసన నటించి.. యాక్టింగ్ లో మంచి మార్కులు కొట్టేసింది. ఇంద్రాణి సినిమాలో ఛాలెంజింగ్ సాంగ్ చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హిందీలో ఐదు ఆల్బమ్ సాంగ్స్ చేసి.. యాక్టింగ్ తో పాటు డ్యాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన తెలుగు మూవీ 2025 లో రిలీజ్ కానుంది. ఓ లవ్ స్టోరీ ఆధారంగా ప్రముఖ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే ఆమె నటించిన హిందీ మూవీ కూడా 2025 లో రిలీజ్ కానుంది.
తన ఫిట్నెస్ , అందంతో ఒక వైపు నటిగా, డ్యాన్సర్‌గా అలరిస్తూ.. మరోవైపు ఎన్జీఓతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటోంది. విదేశాల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఓ సెలబ్రెటీ పాల్గొనాలంటే రెమ్యూనేరషన్ తో పాటు జర్నీ ఖర్చులను కూడా భరించాల్సి ఉంటుంది. కానీ అంకిత మాత్రం స్వచ్ఛధంగా NGO కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం.
మరిన్ని NRI వార్తలకోసం క్లిక్ చేయండి
ఇటీవల అమెరికాలో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకర్షించింది. అందాల తార శ్రీదేవి నటించిన చిత్రాలు, పాటలను గుర్తుకు తెచ్చేలా ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన డాన్స్ కార్యక్రమంలో.. అంకిత తన ఫెర్మామెన్స్ తో అదరగొట్టింది. సత్య మాస్టర్, అంకిత జోడిగా సాగిన ఈ డాన్స్ ప్రోగ్రాంకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్ వచ్చింది. ఇటీవల విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ వద్ద జరిగిన ఈవెంట్ లో దిల్ రాజుతో కలిసి అంకిత పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా న్యూయార్క్, చికాగోలో అంకిత మ్యూజిక్ ఆల్బమ్ షూట్ చేసింది. అలాగే స్విట్జర్లాండ్ , వెనిస్ లోని అందమైన లొకేషన్లలో రెండు సాంగ్స్ షూట్ కంప్లిట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకులు, హాలీవుడ్ వీడియోగ్రాఫర్ లతో కలిసి ఆమె వర్క్ చేసింది. అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు న్యూయార్క్ వేదికగా త్వరలో రిలీజ్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment