సీఈసీ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాలి

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

డిచ్‌పల్లి/నిజామాబాద్‌రూరల్‌: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమ వారం నిర్వహించిన మహా నిరసన ర్యాలీలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ర్యా లీలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు వారు పా ల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కల్పించడం, ఓటర్ల హ క్కులను పరిరక్షించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ఓటర్ల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజాస్వామ్యం రక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement