ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

● వరికి బదులు పప్పు ధాన్యాలు

పండించాలి

● ‘రైతునేస్తం’లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

బోధన్‌: ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలోని రైతు లు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలోని రైతువేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి వి క్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వర్‌ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానం కిశో ర్‌ తదితరులు వీసీలో మాట్లాడారు. సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడంతోపాటు యాసంగి సీజన్‌లో తక్కువ నీటితో తక్కువ కాలంలో చేతికొ చ్చే పంటలను సాగు చేయాలని దిశానిర్దేశం చేశా రు. నీటి లభ్యత లేని చోట పంటలు సాగు చేసి నష్టపోవద్దని రైతులను కోరారు. అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి బదులు ఆరుతడి పంటల సాగుపై రైతుల కు విస్త్రృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నా రు. అధిక లాభదాయకమైన ఆయిల్‌ పామ్‌ పంట సాగు దిశగా రైతులను ప్రొత్సహిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు పంటల ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండలానికి చెందిన ఆదర్శ రైతు నవీన్‌ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వానాకాలం సీజన్‌లో వరికి బదులు కంది,పెసర, మినుము వంటి పప్సు దినుసు పంటలు సాగు చేయడంతో అధిక లాభాలు వచ్చాయని వివరించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భుజంగరావు, డీఏవో వీరాస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, ఆర్డీవో విజయ కుమారి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement