రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ విజేత నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ విజేత నిజామాబాద్‌

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

● తొర్లికొండలో ముగిసిన రాష్ట్రస్థాయి బాలికల సాఫ్ట్‌బాల్‌ పోటీలు

జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర మినీ సబ్‌ జూనియర్‌ అండర్‌–13 బాలి కల అంతర్‌ జిల్లాల సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌న్‌షిప్‌ పోటీలు ముగిశాయి. నిజామాబాద్‌ జిల్లా జట్టు విజేతగా నిలవగా, ద్వితీయ స్థానంలో భద్రాద్రి కొ త్తగూడెం జట్టు నిలిచింది. వరంగల్‌ జట్టు తృతీయ స్థానం సాధించాయి. ముగింపు కార్యక్రమానికి స ర్పంచ్‌ పద్మనాగరాజు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు. పాఠశా ల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మహారాష్ట్రలోని సంజీవిని యూనివర్సిటీ, కోపర్గావ్‌లో జరగనున్న జాతీయ మినీ సబ్‌ జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి క్రీడాకారిణి కృషి చేయాలని పిలుపునిచ్చారు. టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠ శాల క్రీడాకారిణి ఎన్‌ సమంత బెస్ట్‌ పిచ్చర్‌ అవా ర్డును అందుకుంది. సాఫ్ట్‌బాల్‌ ఫెడ రేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌ బాబు, బ్రాహ్మణపల్లి సొసైటీ చైర్మన్‌ నర్సారెడ్డి, ఉపసర్పంచ్‌ తెడ్డు మైపాల్‌, జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్‌, జిల్లా పీఈటీ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌ గంగాధర్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరేందర్‌, వీడీసీ ప్రధాన కార్యదర్శి కనక రాజేశ్‌, కోశాధికారి వేముల నాగరాజు, ఫిజికల్‌ డైరెక్టర్లు వేముల నాగభూషణం, స్వప్న, లత, మెండె రమేశ్‌, కోచ్‌లు నరేశ్‌, అనికేత్‌, మౌనిక, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

సమంతకు బెస్ట్‌ పిచ్చర్‌ అవార్డును అందజేస్తున్న అతిథులు, టోర్నీ నిర్వాహకులు

స్టాఫ్‌బాల్‌ విజేత నిజామాబాద్‌ జట్టుకు షీల్డ్‌ను అందజేస్తున్న సర్పంచ్‌ పద్మ, అతిథులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement