పోస్టులు మంజూరైన గ్రామాలు..
బడులకే పరిమితం కావొద్దు
● మొదటి విడతగా జిల్లాలోని
25 స్కూళ్లల్లో నియామకం
● నవంబర్ నుంచి మార్చి వరకే
కొనసాగింపు
ఆర్మూర్ : జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సమ్మిళిత విద్యను మరింత బలోపేతం చేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్ష, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డా.ఈ.నవీన్ నికోలస్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రతి పీఎంశ్రీ సెకండరీ స్కూల్‌కు ఒకరు చొప్పున గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు .
నోటిఫికేషన్ జారీ..
జిల్లావ్యాప్తంగా మొత్తం 40 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా 25 స్కూళ్లలో ప్రత్యేక టీచర్లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.16,500 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. ఇందుకు జిల్లాకు సుమారు రూ.20,66,500 బడ్జెట్ కేటాయించారు. నియామక కాలం నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలలు మాత్రమే ఉంటుంది. గ్రాడ్యుయేట్‌తోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఈడీ (జనరల్)తోపాటు ఇతర ప్రత్యేక కో ర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ప్రత్యేక ఉపాధ్యాయులు పీఎంశ్రీ స్కూల్‌కే పరిమితం కాకుండా, క్లస్టర్, మండలంలోని ఇతర పీఎంశ్రీ పాఠశాలల్లోని దివ్యాంగ పిల్లలకు కూడా సేవలు అందించాల్సి ఉంటుంది.
డొంకేశ్వర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్, మగ్గిడి, ఆర్మూర్ (గర్ల్స్), బాల్కొండ, ఏర్గట్ల, చౌటుపల్లి, కోనసమందర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, గొట్టుముక్కల, జాన్కంపేట్, రెంజల్, సాలూర, అందాపూర్, (జేసీ) బోధన్, కోటగిరి, పోతంగల్ (టీఎం), మల్లారం, కోటగల్లి, గవర్నమెంట్ యూపీఎస్ వెంగళరావు నగర్ (యూఎం), ఎల్లారెడ్డిపల్లి, ధర్పల్లి, భీమ్‌గల్, పల్లికొండ, చందూర్.
ఎంపికై న ప్రత్యేక ఉపాధ్యాయులు కేవలం పాఠశాలల కే పరిమితం కాకుండా, భవి త కేంద్రాల ద్వారా తగిన వి ద్యాసాయం, కౌన్సెలింగ్, ఇంటి సందర్శనలు చేయాలి. ప్రత్యేక పిల్లలను గుర్తించి, అంచనా వేయడం, తరగతి మార్పులో సహకరించడం, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం ఇవ్వడం వారి ప్రధాన బాధ్యత.
– పడకంటి శ్రీనివాస్ రావు, ఐఈ జిల్లా కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, నిజామాబాద్


