పనుల్లో జాప్యంతో ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

పనుల్లో జాప్యంతో ప్రమాదాలు

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

● జాతీయ రహదారిపై

నెమ్మదిగా కల్వర్టు నిర్మాణం

● 40 రోజుల్లో 12 ప్రమాదాలు..

ముగ్గురి మృతి

నేషనల్‌ హైవే 44పై బోల్తా పడిన లారీ..

స్తంభించిన ట్రాఫిక్‌

హైవేపై కొనసాగుతున్న కల్వర్టు

నిర్మాణ పనులు

ఇందల్వాయి: నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా జాతీయ రహదారిపై చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనుల్లో జాప్యంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోపాటు పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులో 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ కల్వ ర్టు నిర్మాణం చేపట్టింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటిని గ్రామ చెరువులోకి మళ్లించేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా మొదట కామరెడ్డి నుంచి నిజామాబాద్‌ వైపు వచ్చే మార్గంలో రెండు నెలల క్రితం రోడ్డును తవ్వారు. అయితే ఆ మార్గంలో వచ్చే వాహనాలను నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వెళ్లే మార్గంలోకి మళ్లించి వన్‌వేగా మార్చారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారానికి రెండు మూడు ప్రమాదా లు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సుమారు 12 ప్రమాదాలు చోటు చేసుకోగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాగా, కల్వర్టు నిర్మాణం అడవిలో, ప్రమాదకరమైన దిగుడు ప్రాంతంలో ఉన్నందున నాయ్‌ ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పింది. పనులు జరుగుతున్న ప్రాంతంలో రాత్రివేళల్లో సరైన సూచిక బోర్డులు, వాహనాలను దూరం నుంచే నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో డ్రైవర్లు తికమకకు గురై ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేసి రోడ్డు భద్రత నియమాలు పాటించని గుత్తేదారుపై కేసు నమోదు చేయడం గమనార్హం.

భయంగా ఉంది

నాతోపాటు సుమారు 20 మంది రైతులు నిత్యం హైవే మీదుగా పొలాలకు వెళ్తాం. క ల్వర్టు నిర్మాణం మొదటి నుంచే ప్రమాదాలు జరుగుతున్నా యి. దీంతో పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. అధికారులు భద్రత చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలి.

– గడ్డం ప్రశాంత్‌ రెడ్డి, చంద్రాయన్‌పల్లివాసి

దిగుడు రోడ్డుతోనే ప్రమాదాలు

కల్వర్టు నిర్మాణం జరుతున్న ప్రదేశం అటవీ ప్రాంతం కావడంతోపాటు మూలమలుపు, ఎక్కువ దిగుడు ఉండటంతోనే వాహనాలు వేగంగా వచ్చి ప్రమాదాల బారినపడుతున్నాయి. రోడ్డు మళ్లింపుపై స్పష్టమైన సూ చికలు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశాం. పనులు వేగంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపడుతున్నాం.

– రంగారావు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement