● ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టిన అధికారులు
నిజామాబాద్ రూరల్: నగర శివారులోని మాధవనగర్ రైల్వేగేట్ వద్ద నిలిచిన ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) పనులు ఎట్టకేలకు శనివారం పున:ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నిధులు కెటాయించడంతో అధికారులు పనులను చేపడుతున్నారు. ఈక్రమంలో అధికారులు ఆర్వోబీ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. దీంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చే వాహనాలు, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఒకే మార్గం గుండ ప్రయాణించడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.


