నవీపేట: మండలంలోని కోస్లి గ్రామ శివారులో ట్రా న్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గ్రామానికి చెందిన ఋషి అనే రైతు శనివారం పొలంలో నీరు పా రించేందుకు వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ కిందపడి ఉండ డాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చే రుకున్నారు. గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్ నుంచి కాపర్ కాయిల్స్, ఆయిల్‌ను ఎత్తుకెళ్లిన ట్లు గుర్తించారు. లైన్‌మన్ బాబు ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


