‘ఓపెన్‌’ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Oct 11 2026 1:10 PM | Updated on Oct 11 2026 1:10 PM

‘ఓపెన్‌’ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత కార్మికులకు రుణపడి ఉంటాం

బోధన్‌: పట్టణంలోని ఇందూరు బీఈడీ కళాశాలలోఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వివిధ ఓపెన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌, కో–ఆర్డినేటర్‌ అప్పల నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ (ఎడ్యుకేషన్‌), డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌( డిప్లొమా ఇన్‌ ఈసీసీఈ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు ఫారాలను కళాశాలలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 94401 40118ను సంప్రదించాలని సూచించారు.

ఆర్మూర్‌టౌన్‌: తన ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించి ఆటో డ్రైవర్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. ఆటో డ్రైవర్‌ ఓం సాయి శనివారం పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుంచి ప్రయాణికులను తీసుకెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో బ్యాగు మర్చిపోయారు. వెంటనే ఓంసాయి గమనించి బ్యాగును ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు విచారణ జరిపి, బ్యాగు పోగొట్టుకున్న భార్యాభర్తలు మేతరి సంధ్య, వెంకటేష్‌ను గుర్తించి వారికి అప్పగించారు. ఈసందర్భంగా ఓం సాయిని ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌ రెడ్డి అభినందించి సన్మానించారు

నిజామాబాద్‌ రూరల్‌: ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్‌ యూనియన్‌ను అత్యధిక మెజార్టీతో గె లిపించిన కార్మికులకు రుణపడి ఉంటామని ఏ ఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, ఎంప్లా యిస్‌ యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శి రవిచందర్‌, అధ్యక్షుడు దశరథ్‌, టీఎంయూ కార్యదర్శి శ్రీనివాస్‌, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. నగరంలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా లో 1516 ఓట్లు ఎంప్లాయిస్‌ యూనియన్‌కు, 1404 ఓట్లు టీఎంయూకు వేశారని, రాష్ట్రంలో పదివేల పైచిలుకు మెజారిటీ ఏఐటీయూసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆర్టీసీ కార్మికులు ఇ చ్చారని అన్నారు. నాయకులు ఫిరోజ్‌, చక్రపా ణి, లలిత, నర్సయ్య, గంగాధర్‌, యూసుఫ్‌, సందీప్‌ పాల్గొన్నారు.

మాసాన్‌పల్లిలో

చిరుత సంచారం!

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాసాన్‌పల్లి గ్రామశివారులో గల ఆదిమల్లన్నగుట్టపై కొన్నిరోజులుగా చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రెండురోజుల క్రితం గ్రామానికి చెందిన రైతు గేదెలను మేపేందుకు గుట్టపైకి తీసుకెళ్లగా బెదిరి కిందకు వచ్చాయన్నారు. విషయం తెలుసుకొని గ్రామస్తులు శుక్రవారం గుట్టపైకి వెళ్లిచూడగా ఓ బండపై చిరుత పడుకొని ఉందన్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా శనివారం గ్రామానికి చేరుకొని చిరుత ఆనవాళ్ల కోసం పరిశీలించారు. కానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఎఫ్‌ఆర్వో వాసుదేవ్‌ తెలిపారు. మాసాన్‌పల్లి గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement